Published On:

PM Modi : మయన్మార్‌ను ఆదుకొనేందుకు భారత్‌ సిద్ధం : ప్రధాని మోదీ హామీ

PM Modi : మయన్మార్‌ను ఆదుకొనేందుకు భారత్‌ సిద్ధం : ప్రధాని మోదీ హామీ

PM Modi : సైనిక పాలన, అంతర్యుద్ధాలతో మగ్గిపోతున్న మయన్మార్ ప్రజలపై గతవారం సంభవించిన భూకంపం తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమైంది. భూకంప ధాటికి 2,719 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 5 ఏళ్లలోపు చిన్నారులు 50 మంది ఉన్నారు. 4,521 మంది గాయపడ్డారు. 441 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. ఈ క్రమంలో మయన్మార్‌ను ఆదుకొనేందుకు భారత్ సిద్ధమైంది. ఆ దేశాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీనిచ్చారు. బిమ్‌స్టెక్‌ సదస్సు సందర్భంగా థాయ్‌లాండ్‌లో బర్మా సైనిక ప్రభుత్వ అధినేత జనరల్‌ మిన్‌ అంగ్‌ హ్లాయింగ్‌తో ప్రధాని భేటీ అయ్యారు. మయన్మార్‌ను ఆదుకోవడానికి అన్నిరకాల సాయం అందిస్తామని తెలిపారు.

 

ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..
బ్యాంకాక్‌లో బిమ్‌స్టెక్‌ సదస్సు జరుగుతుంది. సందర్భంగా సీనియర్‌ జనరల్‌ మిన్‌ అంగ్‌ హ్లాయింగ్‌తో భేటీ అయినట్లు ప్రధాని తెలిపారు. భూకంపంలో మృతిచెందిన బాధితులకు మోదీ సంతాపం తెలిపాను. ఈ కఠిన సమయంలో మయన్మార్‌‌ను ఆదుకునేందుకు అన్నిరకాల సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించినట్లు చెప్పారు. ముఖ్యంగా అనుసంధాన, సామర్థ్యాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి వంటివి అంశాలపై మాట్లాడుకున్నట్లు ప్రధాని ఎక్స్‌లో చేసిన పోస్టులో వెల్లడించారు.

 

భారత్‌కు మయన్మార్‌ కృతజ్ఞతలు..
2021లో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత తొలిసారి జనరల్‌ మిన్‌ అంగ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఇండియా సాయానికి మయన్మార్‌ కృతజ్ఞతలు తెలిపింది. మయన్మార్‌ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య 3 వేలు దాటేసింది. భారత్‌కు చెందిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పెద్దసంఖ్యలో సహాయక చర్యలు చేపట్టాయి. ఆ దళం డిప్యూటీ కమాండర్‌ కునాల్‌ తివారీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 80 మంది సిబ్బంది, నాలుగు జాగిలాలు, రిగ్గింగ్‌, లిఫ్టింగ్‌, కటింగ్‌, బ్రిడ్జింగ్‌ పరికరాలను మోహరించారు. తమకు స్థానికుల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభిస్తోందని తివారీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: