Earthquake: నేపాల్‌లో భూకంపం.. పరుగులు తీసిన ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు
భారత దేశానికి ఆనుకునే హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న నేపాల్ దేశాన్ని ఇటీవల వరుస భూకంపాలు వణికించాయి. దీనితో ఆ భూకంపం ప్రభావం పక్కనే ఆనుకుని ఉన్న దేశసరిహద్దు భూ భాగం రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా కనిపించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు నేపాల్‌లో 6.3 తీవ్రతతో భారీ భూమి కంపించింది.
Earthquake: భారత దేశానికి ఆనుకునే హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న నేపాల్ దేశాన్ని ఇటీవల వరుస భూకంపాలు వణికించాయి. దీనితో ఆ భూకంపం ప్రభావం పక్కనే ఆనుకుని ఉన్న దేశసరిహద్దు భూ భాగం రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా కనిపించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు నేపాల్‌లో 6.3 తీవ్రతతో భారీ భూమి కంపించింది.
ఈ ప్రభావంతో ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని ఘజియాబాద్, గురుగ్రామ్, ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా ఏర్పడిన ఈ భూ ప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న ఢిల్లీ ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అంతే కాకుండా ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లో మరోసారి కూడా భూమి కంపించిందని అక్కడి అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం 6.27 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొనింది.
I NEVER FELT SUCH STRONG EARTHQUAKE TREMORS. I LEGIT THOUGHT SOME UNNATURAL PRESENCE IS SHAKING MY BED 🙁 😮 STRONG EARTHQUAKE IN FARIDABAD AND DELHI NCR.
— prathimakumar (@prathimakumar30) November 8, 2022
ఇదీ చదవండి: పరీక్ష హాల్ టిక్కెట్ పై అభ్యర్థి ఫొటో బదులు సన్నీ లియోన్ ఫోటో