Published On:

Alaknanda Bus Accident: అలకనంద నదిలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు.. ఒకరు దుర్మరణం!

Alaknanda Bus Accident: అలకనంద నదిలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు.. ఒకరు దుర్మరణం!

10 Missing, 1 Killed after Bus Falls Into Alakananda River in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఘోల్తీర్ సమీపంలో ఉన్న అలకనంద నదిలో ఓ బస్సు కిందపడిపోయింది. వివరాల ప్రకారం.. రుద్రప్రయాగ్ జిల్లాలో పర్యాటకులతో వెళ్తున్న బస్సు అలకనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు మరణించగా.. 10 మంది గల్లంతయ్యారు.

 

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అలకనంద నది పొంగిపొర్లుతుంది. ఈ నది ప్రవాహానికి గల్లంతైన ప్రయాణికుల ఆచూకీ ఆందోళనకరంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు, రాష్ట్ర విప్తతు బృందం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురిని ప్రాణాలతో కాపాడారు.

 

కాగా, బస్సు ఎత్తుగా ఉన్న కొండపైకి వెళ్తుండగా.. డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఒక్కసారిగా బస్సు నదిలోకి పడిపోయింది. గాయపడిన ప్రయాణికులకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి: