Israel-Iran War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి దాడులు

Iran attacks Israel again: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో ఇరాన్ దాడికి దిగింది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన రెండు డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చింది. దీంతో టెలీ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. జెరూసలేం, టెల్ అవీవ్ వంటి ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి.
ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే మీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని చెప్పింది. అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇరాన్ క్షిపణులు దూసుకొచ్చిన విషయాన్ని తొలుత ఐడీఎఫ్ నిర్ధారించగా.. టెహ్రాన్ కూడా స్పందించింది. కాగా, అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్ష దాడులు చేసిన కాసేపటికే ఇరాన్ క్షిపణులతో దాడులకు విరుచుకుపడింది.
ఇదిలా ఉండగా, పశ్చిమ ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పడినట్లు ఎక్స్ వేదికగా ఐడీఎఫ్ ప్రకటించింది. తమ దేశంపై దాడికి సిద్ధంగా ఉంచిన మిసైల్ లాంఛర్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.