Last Updated:

Jodo Yatra Effect: రాహుల్ గాంధీ జోడో యాత్ర ఎఫెక్ట్ .. 51 అసెంబ్లీ స్దానాల్లో 36 చోట్ల కాంగ్రెస్ గెలుపు

కర్ణాటకలో జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పర్యటించిన జిల్లాల్లో మెజారిటీ అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు తమ నేత సాగించిన ప్రచారం కూడా తమకు ఆయా జిల్లాల్లో కలిసి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Jodo Yatra Effect:  రాహుల్ గాంధీ జోడో యాత్ర ఎఫెక్ట్ .. 51 అసెంబ్లీ స్దానాల్లో 36  చోట్ల కాంగ్రెస్  గెలుపు

Jodo Yatra Effect: కర్ణాటకలో జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పర్యటించిన జిల్లాల్లో మెజారిటీ అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు తమ నేత సాగించిన ప్రచారం కూడా తమకు ఆయా జిల్లాల్లో కలిసి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ఏడు జిల్లాల్లో పర్యటించిన రాహుల్..(Jodo Yatra Effect)

కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 4,000 కి.మీ.ల మేర సాగిన 145 రోజుల యాత్ర సెప్టెంబర్ 30, 2022న ఎన్నికల బరిలోకి దిగిన కర్ణాటకలో ప్రవేశించింది. అక్టోబర్ 23 వరకు, రాహుల్ గాంధీ మరియు ఇతర పార్టీ నాయకులు యాత్రలో ఏడు జిల్లాల్లో పర్యటించారు. వీటిలో చామరాజనగర్, మైసూర్, మాండ్య, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి మరియు రాయచూర్ ఉన్నాయి. ఈ ఏడు జిల్లాలు కర్ణాటక అసెంబ్లీలోని 224 నియోజకవర్గాల్లో 51 స్థానాలను కలిగి ఉన్నాయి, వీటిలో కాంగ్రెస్ 36 స్థానాల్లో గెలిచింది.

జిల్లాలవారీగా కాంగ్రెస్ గెలిచిన సీట్లు ఇవే..

చామ‌రాజ‌న‌గ‌ర్ జిల్లాలో మొత్తం నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌లో కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలిచింది.
మైసూర్‌లో 11 స్థానాలు ఉండగా, వీటిలో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది.
మాండ్యాలో, కాంగ్రెస్ ఏడు స్థానాల్లో ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది.
తుమకూరులో మొత్తం 11 స్థానాలు ఉండగా, కాంగ్రెస్ ఆరింటిలో గెలిచింది.
చిత్రదుర్గలో మొత్తం ఆరు స్థానాలు ఉండగా, కాంగ్రెస్ ఐదు స్థానాల్లో  గెలిచింది.
బళ్లారిలో మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
రాయచూర్‌లో మొత్తం ఏడు స్థానాలు ఉండగా వీటిలో నాలుగింటిలో కాంగ్రెస్ తెలిచింది.

జోడో యాత్రలోనే కాకుండా అసెంబ్లీ ఎన్నికలకు కూడా రాహుల్ గాంధీ కర్ణాటకలో విస్తృతంగా పర్యటించారు. 40 శాతం కమీషన్ తీసుకుంటున్న బీజేపీ సర్కారును ఇంటికి పంపాలని, ఆయన ప్రతిచోటా ప్రచారం చేసారు. బెంగళూరు నగరంలో సామాన్యుడిలా బస్సులో ప్రయాణించారు. వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడి వారి సమప్యలను అడిగి తెలుసుకున్నారు.