Last Updated:

Siddarth : హీరో సిద్దార్థ్ పై కావేరి నది జలాల వివాదం ఎఫెక్ట్.. క్షమించమన్న ప్రకాష్ రాజ్

హీరో సిద్దార్థ్.. బాయ్స్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి ఎన్నో చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంటున్నాడు. తాజాగా హీరో సిద్దార్థ్ నటించిన తమిళ సినిమా

Siddarth : హీరో సిద్దార్థ్ పై కావేరి నది జలాల వివాదం ఎఫెక్ట్.. క్షమించమన్న ప్రకాష్ రాజ్

Siddarth : హీరో సిద్దార్థ్.. బాయ్స్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి ఎన్నో చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంటున్నాడు. తాజాగా హీరో సిద్దార్థ్ నటించిన తమిళ సినిమా ‘చిత్తా’ నిన్న సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిన్న బెంగుళూరులో ప్రెస్ మీట్ కి హాజరయ్యారు. ఈ క్రమంలో (Siddarth) ఆయనకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది.

ప్రస్తుతం కర్ణాటక వ్యాప్తంగా కావేరీ నదీ జలాల విషయంపై తీవ్ర వివాదం నడుస్తుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలా వివాదం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. తాజాగా ఇదే విషయానికి సంబంధించి మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. నీటి పంపకాలపై సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాయని ఇరు రాష్ట్రాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కాగా కావేరి పోరాటానికి మద్దతుగా నేడు కర్ణాటక మొత్తం బంద్‌ పాటిస్తున్నారు. ఇందుకు కన్నడ సినిమా ఇండస్ట్రీ కూడా మద్దతు తెలిపింది.

ఈ క్రమంలోనే సిద్దార్థ్ ప్రెస్ మీట్ పెట్టిన చోటుకి వచ్చిన కరవే సంస్థ కార్యకర్తలు ఇది సినిమా ప్రమోషన్స్ కి టైం కాదు వెళ్లిపొమ్మని సిద్దార్దని హెచ్చరించారు. దీంతో సిద్దార్థ సరే అని చెప్పి నా సినిమాని థియేటర్లో చూడండి అని వెళ్లిపోయారు. అయితే అక్కడ ఉన్న కర్ణాటక కార్యకర్తలు తమిళ సినిమాని చూడొద్దు, తమిళ సినిమాని కర్ణాటకలో బహిష్కరించండి అంటూ నినాదాలు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

అయితే మరోవైపు కరవే సంస్థ చేసిన చర్యకు పలువురు మద్దతుగా నిలుస్తుంటే.. హీరోలను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదంటూ మరికొందరు తప్పుపడుతున్నారు. తాజాగా ఈ ఘటనపై నటుడు ప్రకాష్‌ రాజ్‌ స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పారు. దశాబ్దాల నాటి ఈ సమస్యను పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలు, నాయకులందరినీ ప్రశ్నించకుండా, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాని అసమర్థ పార్లమెంటేరియన్లను దృష్టికి తీసుకెళ్లకుండా.. ఇలా నిస్సహాయ సామాన్య ప్రజలను, కళాకారులను హింసించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని.. ఒక కన్నడిగుడిగా, నా తోటి కన్నడిగుల తరపున తరపున సిద్దార్థ్ క్షమించు అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.