Madya Pradesh: చేతి పంపు కొడితే బక్కెట్ల కొద్దీ మద్యం వస్తోంది..!
సాధారణంగా బోరింగ్ అనగా చేతిపంపు కొడితే నీళ్లు వస్తాయి. కానీ ఈ ప్రాంతంలో మాత్రం బక్కెట్ల కొద్దీ మద్యం వస్తుంది. ఇది చూసిన పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణాలో వెలుగులోకి వచ్చింది.
Madya Pradesh: సాధారణంగా బోరింగ్ అనగా చేతిపంపు కొడితే నీళ్లు వస్తాయి. కానీ ఈ ప్రాంతంలో మాత్రం బక్కెట్ల కొద్దీ మద్యం వస్తుంది. ఇది చూసిన పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణాలో వెలుగులోకి వచ్చింది.
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ, స్థానిక యంత్రాంగం వివిధ జిల్లాల్లో డ్రగ్స్ మరియు మద్యంపై ఉక్కుపాదం మోపుతుంది. ఈ నేపధ్యంలోనే గుణాలో మద్యం మాఫియా ఆగడాలను కట్టడి చెయ్యడానికి పోలీసులు విస్తృత దాడులు జరిపారు. అయితే మద్యం అమ్మకాలకు ఎటువంటి ఆటకం కలుగకుండా ఎవరికీ అనుమానం కలుగకుండా ఉండేందుకు మద్యం ముఠా ఓ ఉపాయం వేసింది. ఓ చేతి పంపును ఏర్పాటు చేసి సీక్రెట్ గా విక్రయాలు జరిపుతుంది. ఈ తరుణంలోనే పోలీసులకు ఒక చేతి పంపు దొరికింది. చేతి పంపును కోట్టి చూడగా దాని నుండి నీరు కాకుండా మద్యం బయటకు రావడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా అక్రమ మద్యం స్థావరాలపై పోలీసులు జరిపిన దాడుల్లో సుమారు 6 వేల లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భాన్‌పురాలో నిందితులు మద్యం ట్యాంక్‌ను భూమిలో పాతిపెట్టి దానికి చేతి పంపును అమర్చారు. పోలీసులు చేతిపంపు కొట్టగానే అందులో నుంచి మద్యం రావడం మొదలైంది. ఇక వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి అక్రమ మద్యం అమ్ముతున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
आपने हैंडपंप से पानी निकलते देखा होगा, अब अवैध शराब निकलती देखिए, तस्वीर #MadhyaPradesh के #गुना की है,@ChouhanShivraj के निर्देश के बाद पुलिस की नशे के खिलाफ कार्रवाई जारी है।@drnarottammisra @DGP_MP pic.twitter.com/qiuZ2IZjm6
— Makarand Kale (@makarandkale) October 11, 2022
ఇదీ చదవండి: నన్ను గెలిపిస్తే.. రూ.20 పెట్రోల్, రూ. 100కే గ్యాస్..!