Last Updated:

Telangana Congress: తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీకి తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ తీర్మానం

తెలంగాణ కాంగ్రెస్ తొలి పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పిఎసి) సమావేశం సోమవారం గాంధీభవన్‌లో జరిగింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రం నుండి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని పోటీకి దింపాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ ఈ విషయాన్ని తెలియజేసారు.

Telangana Congress: తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీకి  తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ తీర్మానం

 Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ తొలి పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పిఎసి) సమావేశం సోమవారం గాంధీభవన్‌లో జరిగింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రం నుండి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని పోటీకి దింపాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ ఈ విషయాన్ని తెలియజేసారు.

సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు దీనికి సంబంధించిన లేఖ పంపుతాం.. గతంలో ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి పోటీ చేశారు. తెలంగాణను అందించిన తల్లిగా ధన్యవాదాలు తెలిపామని అన్నారు. తెలంగాణలో 100 రోజుల్లో ఆరు హామీల అమలుపై చర్చించామని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభ్యులకు వివరించారు. నీటిపారుదల శాఖలో జరిగిన అక్రమాలపై కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. విద్యుత్, ఆర్థిక, నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతిపై భట్టి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజెంటేషన్ ఇస్తారని చెప్పారు.

డిసెంబర్ 28 నుంచి గ్రామసభలు..( Telangana Congress)

తెలంగాణలో గ్రామసభలు ఏర్పాటు చేసి రేషన్ కార్డుల పంపిణీ, గృహ నిర్మాణ పథకానికి దరఖాస్తులు తీసుకోవడం, ఆరు హామీల అమలు జరుగుతుందని షబ్బీర్ అలీ తెలిపారు. డిసెంబర్ 28, 2023 నుంచి 15 రోజుల పాటు ప్రతి గ్రామంలో సభలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జిలను నియమించామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవెళ్ల, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు ఇంచార్జ్‌గా ఉంటారని మంత్రి తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ, మంత్రి పొన్నం కరీంనగర్ బాధ్యతలు చూసుకుంటారని అన్నారు. నామినేటెడ్ పోస్టుల నియామక ప్రక్రియను కూడా త్వరలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని షబ్బీర్ ఆలీ వివరించారు.