PM Modi Canada Tour: కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని భేటీ.. కీలక అంశాలపై చర్చ!
PM Modi Canada Tour: కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని మోదీ సమావేశమ్యయారు. కొంతకాలంగా ఇరుదేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరుదేశాధినేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై వ్యతిరేక పోరాటానికి సహకారం అందించడంపై ప్రధాని మాట్లాడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్, కెనడా సంబంధాలు చాలా ముఖ్యమైనవని ప్రధాని మోదీ అభివర్ణించారు. కాగా ప్రధాని మోదీ ఆతిథ్యం ఇవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు మార్క్ కార్నీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పొరాడుతామని కార్నీ ప్రకటించారు.
మరోవైపు ఉగ్రవాదంపై జీ7 సమ్మిట్ లో ప్రధాని మోదీ కీలకవ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూదని ప్రధాని వెల్లడించారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి కేవలం పహల్గామ్ లో జరిగింది మాత్రమే కాదని.. ప్రతి భారతీయుడి ఆత్మ, అస్తిత్వం, గౌరవం మీద జరిగిన దాడిగా అభివర్ణించారు. యావత్ మానవాళిపై జరిగిన ఉగ్రదాడి అన్నారు. ఉగ్రవాదం మానవత్వానికే శుత్రువని, ప్రజాస్వామ్య విలువలు పాటిస్తున్న అన్ని దేశాలకు ఇది వ్యతిరేకమన్నారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే ఏ దేశమైనా.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇక రెండు రోజులపాటు జరిగిన ప్రధాని మోదీ కెనడా పర్యటన ముగిసింది. తన కెనడా పర్యటనపై ప్రధాని ట్వీట్ చేశారు. జీ7 సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించిన కెనడా ప్రజలు, ప్రభుత్వానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. సమావేశాల్లో గ్లోబల్ అంశాలపై కీలక చర్చలు జరిగాయని చెప్పారు. శాంతి, సమృద్ధి, స్థిరత్వానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కోరారు. కాగా ప్రధాని మోదీ కెనడా నుంచి క్రొయేషియా పర్యటనకు వెళ్లారు.