Iran- Israel War: ఎనిమిదో రోజు కొనసాగుతున్న యుద్ధం

Crucial War Between Iran and Israel: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. గత వారం రోజులుగా పరస్పరం దాడులు జరుగుతుండగా.. ఇవాళ ఎనిమిదో రోజు కూజా ఇరుదేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ క్లస్టర్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ లోని ఆస్పత్రులు, స్టాక్ ఎక్స్చేంజ్ భవనంపై దాడులు చేసింది. దీంతో రాజధాని టెల్ అవీవ్ శివార్లలో భారీగా నష్టం ఏర్పడింది. దాడుల్లో ఒక్కరోజే 200 మందికిపైగా గాయపడ్డారు.
ఇక ఇరాన్ లోని అరాక్ హెవీ వాటర్ ప్లాంట్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్ అణు రియాక్టర్ ధ్వంసమైనట్టు సమాచారం. మరోవైపు ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని రష్యా కోరింది.
ఇక ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ తో త్వరలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇరాన్ పై సైనిక చర్య విషయంలో రెండు వారాల్లో ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఒకవేళ మాట వినకపోతే ఇరాన్ పై సైనిక చర్యకు చేపట్టేందుకు అమెరికా రెడీ అవుతోంది. అమెరికా చర్యలతో రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ పై అమెరికా సైనిక చర్యకు దిగడం ప్రమాదకరమని తెలిపింది.