Last Updated:

One Day Crorepati: ఈ ఒక్కరోజు కోటీశ్వరుడెవరో మీకు తెలుసా..?

అతను ఏ లాటరీ టికెట్టు కొనలేదు.. ఆన్లైన్ ట్రేడింగ్ చెయ్యలేదు కానీ కోటీశ్వరుడయ్యాడు. అదెలా అనుకుంటున్నారా... బ్యాకింగ్ సేవల్లో పొరపాటు వల్ల ఓ వ్యక్తి  ఒక్కరోజు కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది.

One Day Crorepati: ఈ ఒక్కరోజు కోటీశ్వరుడెవరో మీకు తెలుసా..?

Gujarat:  అతను ఏ లాటరీ టికెట్టు కొనలేదు. ఆన్లైన్ ట్రేడింగ్ చెయ్యలేదు కానీ కోటీశ్వరుడయ్యాడు. అదెలా అనుకుంటున్నారా, బ్యాకింగ్ సేవల్లో పొరపాటు వల్ల ఓ వ్యక్తి  ఒక్కరోజు కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది.

బ్యాకింగ్‌ సేవల్లో పొరపాట్ల వల్ల కొందరు వ్యక్తులు కొన్ని గంటలపాటు కోటీశ్వరులవుతున్నారు. అదే విధంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన రమేష్ సాగర్ అనే వ్యక్తి ఖాతాలో పొరపాటున రూ.11,677 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆ వ్యక్తి సుమారు ఒక రోజు కోటీశ్వరుడయ్యాడు. కాగా ఆ డబ్బు తిరిగి వెనక్కి వెళ్లింది.

రమేష్ సాగర్ గత ఐదేళ్లుగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నాడు. కాగా గత ఏడాది కోటక్ సెక్యూరిటీస్‌లో అతడు డీమ్యాట్ అకౌంట్ తీసుకున్నాడు. అయితే నెల రోజుల కిందట అతడి డీమ్యాట్ అకౌంట్లో సుమారు 12 వేల కోట్లు జమ అయ్యాయి. జూలై 26న తన డీమ్యాట్‌ ఖాతాలో సుమారు 12వేల కోట్ల రూపాయలు ఉండడం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఈ మొత్తం నుంచి రెండు కోట్లను స్టాక్‌ మార్కెట్‌లో పెట్టి, మరో ఐదు లక్షలకు లాభాలు బుక్‌ చేశాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి 8.30 గంటలకు సాగర్‌ ఖాతాలో పొరపాటున జమ అయిన కోట్లాది డబ్బు మాయమైంది.

తీరా చూస్తే కోటక్ సెక్యూరిటీస్ యాప్‌లోని సాంకేతిక సమస్యల వల్ల ఇలా జరిగిందంటూ ఆ బ్యాంకు నుంచి అతడికి మెసేజ్‌ వచ్చింది. ఆ రోజున కోటక్ ఖాతాలు ఉన్న మరికొంత మంది వ్యక్తులకు ఇలానే పెద్ద మొత్తంలో డబ్బు జమయ్యిందట.

ఇదీ చదవండి: ఎగిరొస్తున్న చిరుతలు.. నమీబియా నుంచి 8 చీతాలు రాక

ఇవి కూడా చదవండి: