Last Updated:

Odisha Minister: ఒడిశా మంత్రిపై కాల్పుల కలకలం.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు

Odisha Minister: ఒడిశాలో కాల్పులు కలకలం రేపాయి. ఏకంగా మంత్రిపైనా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బ్రెజరాజ నగర్‌లోని గాంధీ చౌక్‌ వద్ద మంత్రి నబకిశోర్‌దాస్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు.

Odisha Minister: ఒడిశా మంత్రిపై కాల్పుల కలకలం.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు

Odisha Minister: ఒడిశాలో కాల్పులు కలకలం రేపాయి. ఏకంగా మంత్రిపైనా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బ్రెజరాజ నగర్‌లోని గాంధీ చౌక్‌ వద్ద మంత్రి నబకిశోర్‌దాస్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు.

ఒడిశాలో ఓ మంత్రిపై కాల్పులు జరపడం కలకలం రేపింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్‌ దాస్‌పై దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో మంత్రికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. దాడి వెంటనే.. భద్రతా సిబ్బంది సమీప ఆస్పత్రికి తరలించారు.

ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ ఛాతీలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా ప్రకటించింది.

ఓ ప్రారంభోత్సవ కార్యక్రంలో పాల్గొనేందుకు మంత్రి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
పథకం ప్రకారమే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఝార్సుగూడ జిల్లా బ్రిజరాజ్‌ నగర్‌లోని మంత్రి (Odisha Minister)  వాహనం దిగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

ఈ దాడి చేయడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దాడి అనంతరం.. బీజేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు.

దీంతో ఘటన జరిగిన ప్రదేశంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గోపాలచంద్ర దాస్ అనే ఏఎస్సై ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మంత్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించనున్నట్లు తెలుస్తోంది.

బిజూ జనతాదళ్‌లో సీనియర్‌ నేత అయిన నబకిశోర్‌ దాస్‌ ఇటీవలే వార్తల్లో నిలిచారు.

మహారాష్ట్రలోని శని శింగణాపుర్‌ దేవాలయానికి భారీగా విరాళం ప్రకటించి వార్తల్లోకెక్కారు.
సుమారు రూ. కోటికిపైగా విలువ చేసే ఆభరణాలను విరాళంగా ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఈ దాడి జరగడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది.

ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మంత్రిపై కాల్పులు జరపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/