Published On:

Kommineni Srinivas Arrest: కొమ్మినేని అరెస్ట్‌ అప్రజాస్వామికం: అంబటి

Kommineni Srinivas Arrest: కొమ్మినేని అరెస్ట్‌ అప్రజాస్వామికం: అంబటి

సీనియర్‌ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ అప్రజాస్వామికమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బెయిల్ రాకుండా చేసేందుకే కొమ్మినేనిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని అన్నారు. ఒక పథకం ప్రకారం కొమ్మినేని అరెస్టు జరిగిందని అంబటి అన్నారు. చంద్రబాబుకి ప్రేమ అమరావతి రైతుల మీద కాదని…అమరావతిలో తాను దోచుకునే భూముల మీదనే అని అంబటి విమర్శించారు. మీడియా డిబేట్స్‌లో వైఎస్‌ జగన్, భారతిలపై చాలా దారుణంగా వ్యాఖ్యానించింన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం హేయమన్న అంబటి.. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో కొత్త సంప్రదాయానికి తెర లేపిందని మండిపడ్డారు. ఇటువంటి చర్యలు మీడియా స్వేచ్ఛకు భంగమన్న అంబటి.. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవన్నారు.

ఇవి కూడా చదవండి: