Published On:

Iran Israel War: ఆమెరికా రూటే సపరేటు..! లాభం లేనిదే కల్పించుకోదు.!

Iran Israel War: ఆమెరికా రూటే సపరేటు..! లాభం లేనిదే కల్పించుకోదు.!

Iran Israel War: ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ యుద్ధం మొదలై శుక్రవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ నెల 13వ తేదీన ఇరాన్‌ రాజధాని టెహరాన్‌పై ఇజ్రాయెల్‌ చడీచప్పుడు కాకుండా తెల్లవారుజామును న్యూక్లియర్‌ ప్లాంట్లపై వైమానికదాడులతో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఇరాన్‌కు చెందిన టాప్‌ మిలిటరీ కమాండర్లతో పాటు ఫిజిక్స్‌ సైంటిస్టును చంపేసి చక్కా వెళ్లిపోయింది. అటు తర్వాత ఇరాన్‌ వంతు వచ్చింది.

 

ఇక ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌కు చెందిన టెక్‌ హబ్‌లతో పాటు ఆస్పత్రులు, జనావాసాలపై బాంబు దాడులు కురిపిస్తోంది. ప్రపంచదేశాలు జోక్యం చేసుకొని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరినా, ఆ దిశగా అడుగులు పడే అవకాశాల్లేకుండా పోయాయి. మరి ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. ఇక తాజా యుద్దంపై ఇరాన్‌ ప్రజలు రెండుగా విడిపోయారు. ఒకరు ఖమేనీకి మద్దతు తెలిపితే మరి కొంత మంది వ్యతిరేకిస్తున్నారు.

 

అమెరికా మాత్రం యుద్దాన్ని పెంచి పోషిస్తోందా లేక ఆపడానికి ప్రయత్నిస్తుందా అనే అనుమానం వ్యక్తమవుతుంది. అమెరికా ప్రెసిడెంట్ అంటే ఒక గౌరవం హోదా.. ప్రపంచంలోని అన్నీ దేశాలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తుంటారు ఆ దేశాధ్యక్షుడు. ఇప్పటి వరకు ఉన్న అమెరికన్‌ ప్రెసిడెంట్లు హుందాగా వ్యవహరిస్తూ అమెరికా పరువును కాపాడారు. మరి తాజాగా అమెరికా ప్రెసిడెంట్‌గా బాద్యతలు స్వీకరించిన డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారం మాత్రం వారికి భిన్నంగా ఉంది. ఆయన రూటే సపరేటు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

 

తన సొంత లాభం తప్పించి ఇతరులకు సాయపడ్డాలన్న ఆలోచన అమెరికాకు లేకుండా పోయింది. ఇక ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆస్తుల విలువ కూడా విపరీతంగా పెరిగిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన ఇరు దేశాలు మధ్య చిక్కు ముడులు విప్పాల్సింది పోయి మరింత జటిలం చేస్తున్నారు. అయ్యే పనిని కాకుండా తాత్సారం చేసి లబ్ది పొందాలనుకుంటున్నాడు. ఆయన వ్యవహార శైలితో అమెరికాకు చెడ్డ పేరు తెస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ యుద్ధంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమమవుతుంది.

ఇవి కూడా చదవండి: