Published On:

NATO: రష్యానే టార్గెట్.. నాటో దేశాల రక్షణ బడ్జెట్ పెంపు.!

NATO: రష్యానే టార్గెట్.. నాటో దేశాల రక్షణ బడ్జెట్ పెంపు.!

USA: అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్ట్‌ ట్రంప్‌ పక్కా బిజినెస్‌ మెన్‌ అని మరోమారు తేలిపోయింది. నాటో దేశాలను గత కొన్ని నెలల నుంచి డిఫెన్స్‌ బడ్జెట్‌ను తమ జీడీపీలో 5 శాతానికి పెంచాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు. దీంతో ఇటీవల హేగ్‌లో ముగిసి సదస్సుల్లో నాటో దేశాలు అంగీకరించినందుకు ట్రంప్‌ ఉబ్బితబ్బిబై పోతున్నాడు. ఇది అతి పెద్ద విజయమని సంబరపడిపోతున్నాడు. నాటో దేశాలకు చెందన చెందిన నాయకులు 2035 వరకు తమ బడ్జెట్‌లో ఐదు శాతం రక్షణ రంగానికి కేటాయించాలని ఎట్టకేలకు నిర్ణయించారు. హేగ్‌ సమ్మిట్‌లో తీసుకున్న ఈ నిర్ణయం ఇటు యూరోప్‌తో పాటు పాశ్చాత్య దేశాలకు అతి పెద్ద విషయమని సదస్సు జరిగిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇక ట్రంప్‌ నాటో దేశాలకు డిఫెన్స్‌ బడ్జెట్‌ పెంచుకోవాలని చెప్పడానికి ప్రధాన కారణం దీర్ఘకాలంలో రష్యా నుంచి మీకు ఇబ్బందులు తప్పవు. అలాగే టెర్రరిజం నుంచి ఇబ్బందులు తప్పవు. ఇప్పటి నుంచే డిఫెన్స్‌ బడ్జెట్‌ను పెంచుకుంటే తప్ప రష్యాను, టెర్రరిజాన్ని బలంగా ఎదుర్కొనలేరని నాటో దేశాలకు వివరించి చెప్పాడు. ఇక నాటో దేశాలకు చెందిన నాయకులు కూడా నాటోలోని సభ్యత్వ దేశాలపై రష్యా దాడులు చేస్తే కలిసి కట్టుగా ఎదుర్కొందామని కమిట్‌ అయ్యారు.

 

ఇంత వరకు బాగానే ఉన్నా హేగ్‌లో జరిగిన సమ్మిట్‌లో రష్యా గత నాలుగు సంవత్సరాల నుంచి ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోంది. ఈ సమ్మిట్‌లో నాటో దేశాలు మాత్రం రష్యా చర్యను ఖండించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే గత ఏడాది మాత్రం రష్యా చర్యను నాటో దేశాలు ఖండించాయి. నాటో భద్రతకుముప్పు ఏర్పడినప్పుడు అందరు కలిసి కట్టుగా ఎదుర్కొందామని నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టే అన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నాటో బలంగా ఉందన్నారు. ఇక నాటో సమ్మిట్‌ ప్రారంభం కావడానికి ముందు ట్రంప్‌ను నాటో దేశాలకు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తారా అని ప్రశ్నిస్తే. ఆయన ఆర్టికల్‌-5 లోని కొన్ని అంశాలను ప్రస్తావించారు. సమ్మిట్‌ జరిగిన తర్వాత ఆయన మరోమారు మీడియాతో మాట్లాడుతూ..తాను ఆర్టికల్‌ -5కు కట్టుబడి ఉంటానన్నారు. అందుకే తాను ఇక్కడ ఉన్నానని అన్నారు ట్రంప్‌. ఇక హేగ్‌ సమ్మిట్‌ విజయవంతమైందని… చారిత్రాత్మకమైందని మార్క్‌ రుట్టే బుధవారం నాడు చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని .. శాంతి కోసం ప్రయత్నిస్తామన్నారు మార్క్‌రుట్టే.

 

ఇక హేగ్‌ సమ్మిట్‌లో నాటో మిత్ర దేశాలు వచ్చే పది సంవత్సరాల పాటు తమ జీడీపీలో ఐదు శాతం డిపెన్స్‌ కేటాయించాలి.. వాటిలో 3.5 శాతం డిఫెన్స్‌కు కేటాయిస్తే.. 1.5 శాతం డిఫెన్స్‌ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌కు కేటాయించాలని ముక్తకంఠంతో అంగీకరించాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వెనకుండి షో నడిపించింది మాత్రం ట్రంప్‌ అని.. కాగా సమ్మిట్‌ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమ్మిట్‌ విజయం వంతం అయ్యిందన్నారు. కాగా ట్రంప్‌ చివరగా 2019లో జరిగిన హేగ్‌సమ్మిట్‌కు హాజరయ్యారు. అయితే ట్రంప్‌ నాటోలోని ప్రతి దేశం తమ జీడీపీలో 5 శాతం రక్షణ రంగానికి కేటాయించాలని డిమాండ్‌ చేయడంతో కొన్ని మిత్ర దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఉదాహరణకు స్పెయిన్‌ 5 శాతం వ్యయం చేయాలని ఒత్తిడి తేవడాన్ని అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పెయిన్‌ ఆర్థికమంత్రి కార్లోస్‌ క్యూర్పో సమ్మిట్‌ ప్రారంభం కావడానికి ముందే మాడ్రిడ్‌ ఎంతో కష్టపడితే తప్ప తాము డిపెన్స్‌ రంగానికి జీడీపీలో 2.1 శాతం కేటాయించలేకపోతున్నామని ఆవేదన వ్యక్త చేశారు. రక్షణ రంగానికి ఐదు శాతం కేటాయిస్తే.. హెల్త్‌కేర్‌, ఎడ్యూకేషన్‌ రంగాలకు కోత విధించాల్సి వస్తుందని ఆయన ఆందోలన వ్యక్తం చేశారు.

 

నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టీ సమ్మిట్‌ మాత్రం సమ్మిట్‌ విజయవంతం అయ్యింది. రక్షణ రంగానికి ట్రంప్‌ చెప్పినట్లు ప్రతి దేశం జీడీపీలో ఐదు శాతం వ్యయం చేయడానికి అంగీకరించాయని గొప్పలు చెప్పుకున్నా వాస్తవం మాత్రం అక్కడ కళ్లకు కట్టినట్లు కనిపించింది. సంప్రదాయబద్దంగా వస్తున్న ‘ప్యామిలీ పోటో’ సెషన్‌కు స్పానిష్‌ ప్రదానమంత్రి పెడ్రో సాంజ్‌ గ్రూపులో నిలబడకుండా ఎక్కడో గ్రూపులో చివర్లో నిలబడ్డం వాస్తవాలకు అద్దం పడుతున్నాయి. అయితే చివరకు ఆయన మనసు మార్చుకున్నాడో ఏమో తెలియదు కానీ నాటో స్టేట్‌మెంట్‌పై సంతకాలు చేశాడు. కమిట్మెంట్‌ను మాడ్రిడ్‌ అంగీకరిస్తుందన్నారు. అలాగే బెల్జియం ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రదానమంత్రి బార్ట్‌ డీ వెవర్‌ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే పది సంవత్సరాల పాటు జీడీపీలో 3.5 శాతం డిఫెన్స్‌కు కేటాయించటంటే అంత తేలికగా కాదు.. టఫ్‌ టాస్క్‌ అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్లోవేకియా కూడా ఐదు శాతం కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రెసిడెంట్‌ పీటర్ పెల్లెగ్రిని బ్రాటిస్లావా ఏదో విధంగా సర్దుబాటు చేస్తామని ఆయన కూడా అసంతృప్తిగానే అంగీకరించారు.

 

ఇక ప్రెంచి ప్రెసిడెంట్‌ ఎమ్మాన్యూయెల్‌ మక్రాన్‌ మాత్రం ట్రంప్‌ను టారిఫ్‌ల పెంచడంపై నిలదీశారు. యూరోపియన్‌ యూనియన్‌తో డీల్‌ కుదుర్చుకోవాలని మక్రాన్‌ కోరారు. మిత్ర దేశాలు ఒకరితో ఒకరు ట్రేడ్‌ వార్‌కు దిగడంలో అర్థం లేదన్నారు మక్రాన్‌. ఇక రుట్టే మట్లాడుతూ ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన సమయంలో మనం సమావేశం అవుతున్నాం. నాటోలోని సభ్యదేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి చేసినా అన్నీ దేశాలు కలసి ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని ట్రంప్‌ చక్కగా హ్యాండిల్‌ చేశారని రుట్టే ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ట్రంప్‌ మాట్లాడ్డానికి తన వంతు రాగానే ఇజ్రాయెల్‌- ఇరాన్‌లు స్కూళ్ల పిల్లల మాదిరిగా కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అప్పుడు రుట్టే జోక్యం చేసుకొని .. ట్రంప్‌ను ఉద్దేశించి డాడీ వచ్చి ఇద్దరిని తన్ని తగలేశారని జోక్‌ చేస్తూ అన్నారు. అయితే ట్రంప్‌ ఇరుదేశాల మధ్య యుద్ధం జుగుతున్నప్పుడు ఆయన నోటి నుంచి అలవోకగా ‘ఎఫ్‌’ వర్డ్ రావడం పెద్ద దుమారంగా మారింది. దానికి రుట్టే ట్రంప్‌ను కవర్‌ చేస్తూ.. డాడీ తిట్టినా తప్పులేదు అంటూ ట్రంప్‌ను వెనకెసుకువచ్చాడు.

 

ఇక అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌ స్కీతో ఇదే సమ్మిట్‌లో భేటీ అయ్యారు. తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌… రష్యా మధ్య కాల్పుల విరమణ అతి పెద్ద సవాలుగా మారిందన్నారు. ఉక్రెయిన్‌కు ఎయిర్‌ డిపెన్స్‌ సిస్టమ్స్‌ పంపుతామని హామీ ఇచ్చారు. జెలెన్‌ స్కీని హ్యాండిల్‌ చేయడం కొంత ఇబ్బందే.. మొత్తానికి జెలెన్‌ స్కీ a nice guy అంటూ ప్రశంసలు కురిపించారు. పుతిన్‌తో కూడా చాలా సార్లు మాట్లాడారు. అప్పుడు పుతిన్‌ తనతో మాట్లాడుతూ.. స్వచ్చందంగా ఇరాన్‌ విషయంలో సాయం చేయడానికి ముందుకు వస్తాను అని చెప్పాడు. దానికి తాను తనకు ఒక ఫేవర్‌ చేయాలని కోరాను…. ముందుగా రష్యా.. ఉక్రెయిన్‌ యుద్దాన్ని ఆపించే ఆలోచన చేయి.. ఇరాన్‌ గురించి తాను చూసుకుంటాను అని చెప్పాను అని మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌ వివరించారు. మొత్తానికి నాటో మిత్ర దేశాలన్నీ కలిసి ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని తీర్మానం చేశాయి. బ్రిటన్‌ ప్రధానమంత్రి సర్‌ కీరి స్టార్మన్‌ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి నాటో దేశాలన్నీ ఐకమత్యంగా కలిసి రాబోయే సవాళ్లను ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. అలాగే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నాటో బలంగా ఉందన్నారు బ్రిటన్‌ పీఎం.

 

ఇవన్నీ ఒక ఎత్తయితే ఈయు మంత్రులు కలిసి 174 బిలియన్‌ డాలర్ల ఆర్మ్‌ ఫండిగ్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారు. దీంతో నాటో సభ్యదేశాలకు డిపెన్స్‌ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక ట్రంప్‌ బడ్జెట్‌ను పెంచాలని హకుం జారీ చేసిన తర్వాత నాటోదేశాలు డబ్బు ఎక్కడి నుంచి తేవాలని తలల బాదుకుంటున్నారు. ఇక వారి ముందున్న ఆప్షన్స్‌ ఒకటి రెవెన్యూ పెంచుకోవడానికి తిరిగి ప్రజలపై పన్నులు బాధడం.. లేదా ఇతర రంగాలకు కోతలు విధించడం. ముఖ్యంగా రోజవారి ప్రజల అవసరాలను తీర్చే హెల్త్‌కేర్‌తో పాటు ఎడ్యూకేషన్‌ రంగాలకు కోత విధించడం. నాటోలోని 32 సభ్యదేశాల్లో ఏ ఒక్క దేశం కూడా డిపెన్స్‌పై ఐదు శాతం ఖర్చు చేయడం లేదు. దానికి బదులు ఈ దేశాలు హెల్త్‌కేర్‌, ఎడ్యూకేషన్‌పై వ్యయం చేస్తున్నాయి. ఒక వేళ ఐదు శాతం ఖచ్చితంగా డిపెన్స్‌కు వ్యయం చేయాలంటే 21 దేశాలు ఎడ్యూకేషన్‌తో పాటు కీలకమైనఇతర రంగాల్లో కోత విధించాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ దేశాలన్నీ మిలిటరీ పై ఎక్కువ వ్యయం చేసి స్కూళ్లకు కోతలు విధించాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి నాటో సభ్యదేశాలు. ఇక ట్రంప్‌ ఉద్దేశం డిఫెన్స్‌కు కేటాయింపులు చేయించి వారి నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని చూస్తున్నాడనేది బహిరంగ రహస్యమే. ప్రశాంతంగా ఉన్న యూరోప్‌ను కూడా ట్రంప్‌ రొచ్చులోకి రావడం నిజంగానే ట్రాజెడీ అని చెప్పక తప్పదు. ఇక చివరగా హేగ్‌ సమ్మిట్‌ మంగళవారం నాడు డిన్నర్‌తో మొదలైంది. డిన్నర్‌కు డచ్‌ కింగ్‌ విలియం అలెగ్జాండర్‌, క్విన్‌ మాక్సిమా ఆతిథ్యం ఇచ్చారు.. సంపన్నదేశాలకు చెందిన నాయకులు సుమారు రెండున్నర గంటల పాటు డిన్నర్‌ను ఏంజాయ్‌ చేశారు. ఇక సెంటర్‌ ఆఫ్‌ ది అట్రెక్షన్‌గా క్విన్‌ మాక్సిమా నిలిచారు. అందరూ ఆమె ఆతిథ్యాన్ని ప్రశంసించారు.

 

ఇవి కూడా చదవండి: