CM Chandrababu: గంజాయిపై యుద్దం… సపోర్ట్ చేసిన వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరులో యాంటీ నార్కోటిక్క్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. గంజాయి నిర్మూలన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు. ప్రతిపక్షాలు కూడా ముందుకువచ్చి ప్రజల్లో చైతన్యం తేవాలని కోరారు. ఈగల్ పేరుతో గంజాయిపై రాష్ట్రవ్యాప్తంగా డేగకన్ను వేశామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ పెడ్లర్స్ మారాలని, లేకపోతే రాష్ట్రం విడిచి వెళ్ళాలని చెప్పారు. ఆడపిల్లల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మద్యం ఆదాయంలో రెండు శాతాన్ని గంజాయి నిర్మూలనకు ఖర్చు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.
గంజాయికి బానిసలవడం వలన కుటుంబాలు రోడ్డునపడుతున్నాయన్నారు. గంజాయి వినియోగం వలన క్రైమ్ రేట్ పెరుగుతుందన్నారు. గంజాయిపై డేగకన్ను ఉంటుందని దానకి ఈగల్ పేరుతో టీం రెడీఅయిందని అన్నారు. 26జిల్లాల్లో నార్కోటిక్స్ సెల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. మధ్యం ఆదాయంలో 2 శాతం డ్రగ్స్ నిర్మూలనకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనను కేవలం టీడీపీ నాయకులు, ప్రభుత్వం మాత్రమే చేయాలని కాదని ప్రతిపక్షంతో పాటు సినీనటులు కూడా ముందుకు రావాలని చంద్రబాబు పిలుపిచ్చారు.