Published On:

Iran -Israel War: ఇరాన్- ఇజ్రాయిల్ యుద్దం.. ఢిల్లీలో పలు విమానాల రాకపోకలు రద్దు!

Iran -Israel War: ఇరాన్- ఇజ్రాయిల్ యుద్దం.. ఢిల్లీలో పలు విమానాల రాకపోకలు రద్దు!

Several Flights Cancelled in Delhi due to Iran -Israel War: మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే, ఇక్కడి నుంచి వెళ్లే పలు విమానాలు రద్దయ్యాయి. ఆయా మార్గాల్లో రూట్లు మూసివేయడంతో ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి వచ్చే, వెళ్లే విమానాలు రద్దయ్యాయి. దీంతో 48 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇందులో ఎయిర్ ఇండియా 17, ఇండిగో 8, ఇతర విమాన సంస్థలు 3 ఉన్నాయి. ఢిల్లీ నుంచి బయల్దేరే విమానాల్లో 10 ఎయిర్ ఇండియా, ఇండిగో 7, మిగతా విమానాలు 3 రద్దయ్యాయి.

 

మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో విమానాశ్రయలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయని, తాము జాగ్రత్తగా విమాన సేవలను పునరుద్ధరిస్తున్నామని వెల్లడించింది. ప్రయాణికుల భద్రతకే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అందుబాటులో ఉన్న సురక్షిత మార్గాల ద్వారా సేవలు అందిస్తామని తెలిపింది. స్పైస్ జెట్, అకాసా ఎయిర్ వేస్ సంస్థలు కూడా తమ విమానాలపై ప్రభావం పడొచ్చని తెలిపాయి. కాగా ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ఓకే చెప్పడంతో విమానాలు నడిచే అవకాశం ఉంది. దీంతో ఖతార్, బహ్రెయిన్, యూఏఈ, కువైట్, ఇరాక్ దేశాల్లో తాత్కాలికంగా ముసివేసిన గగనతలాన్ని తిరిగి తెరవనున్నాయి.

 

ఇవి కూడా చదవండి: