Published On:

Operation Sindhu: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. కొనసాగుతున్న ఆపరేషన్ సింధు

Operation Sindhu: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. కొనసాగుతున్న ఆపరేషన్ సింధు

Indian Government continued Operation Sindhu: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. గత 12 రోజులుగా ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ యుద్దంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ అణుఒప్పందాలకు ఓకే చెప్తేనే దాడులు ఆగుతాయని అమెరికా అంటోంది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు గడువులు కూడా విధించారు. అయినా ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. అయితే ఇరుదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దేశానికి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ సింధు చేపట్టింది. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను తరలిస్తోంది. కాగా ఇప్పటివరకు స్వదేశానికి 2,294 మంది భారతీయులు తిరిగివచ్చారు. వీరిలో ఇరాన్ నుంచి జమ్ము, ఢిల్లీ, యూపీ, బీహార్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు.

 

మరో విమానంలో ఢిల్లీ చేరుకున్న 16 మంది ఏపీ వాసులు ఉన్నారు. ఇందులో రాజమండ్రి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల జిల్లాకు చెందిన వారు ఉన్నారు. తీర్థయాత్రకు వెళ్లినవారు సహా.. ఐదుగురు కెర్మన్ మెడికల్ యూనివర్శిటీ విద్యార్థులు, మరో రెండు విమానాల్లో భారతీయులు ఢిల్లీకి చేరుకోనున్నారు. మరోవైపు తెలంగాణకు చెందిన వారు కూడా ఇదే విమానాల్లో ఢిల్లీ రానున్నారు.

 

ఇవి కూడా చదవండి: