Published On:

Iran- Israel War Update: ఇరాన్ దాడులు.. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసం

Iran- Israel War Update: ఇరాన్ దాడులు.. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసం

Israel Defence System Damaged due to Iran Ballistic Missiles: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. వారం రోజులుగా ఇరు దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతుండగా, రెండు దేశాల్లో భారీగా నష్టం కలుగుతోంది. ఇక ఇరాన్ లోని అణు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు తీరని నష్టం కలిగింది. ఆదేశానికి చెందిన పలువురు అణు శాస్త్రవేత్తలు, ఆర్మీ అధికారులు, ప్రజలు, ఉన్నతాధికారులు మరణించారు. దీంతో ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను ఛేదించి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయినట్టు సమాచారం. దేశంలోని పలు నగరాల్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో ఇజ్రాయెల్ లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.

 

ఇజ్రాయెల్ లోని స్కూళ్లు, ఆస్పత్రులు, పబ్లిక్ స్పాట్లు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. ఇప్పటి వరకు ఇరాన్ 400 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్టు టెహ్రాన్ ప్రకటించింది. కాగా ఇప్పటివరకు ఇరాన్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 24 మంది మరణించారని, మరో 600 మంది గాయపడ్డారని నెతన్యాహు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కాగా ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్ పై దాడులు చేస్తోంది.

మరోవైపు ఇరాన్ చేస్తున్న దాడులతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ లోని నిఘా విభాగం మొస్సాద్ కేంద్రంపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ లో పడిపోయింది. మరోవైపు ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ లోని ఆయుధ వ్యవస్థలు ఖాళీ అయిపోతుండటం ఆందోళనకరంగా మారుతోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వద్ద కేవలం 12 రోజులకు మాత్రమే రక్షణ వ్యవస్థలు పనిచేసే అవకాశం ఉందని తెలిపింది. అయితే తాజాగా జరిపిన ఇరాన్ దాడుల్లో రక్షణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో ఇజ్రాయెల్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.