Published On:

Operation Sindhu: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్ కు 110 మంది విద్యార్థులు!

Operation Sindhu: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్ కు 110 మంది విద్యార్థులు!

Operation Sindhu- 110 Medical Students reached Delhi from Iran: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం మరింతగా ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. అందులో భాగంగా ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులను తీసుకుంది. ఈ విమానం ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఇరాన్ లో యుద్ధం జరుగుతున్న వేళ, విద్యార్థులను ఉత్తర ఇరాన్ నుంచి అర్మేనియా రాజధాని యెరవాన్ కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకువచ్చారు. వారిలో 90 మంది జమ్ముకాశ్మీర్ వాసులు ఉన్నారు. వీరంతా ఉర్మియా మెడికల్ యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.

 

ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులను… కుటుంబీకులు కలిసి భావోద్వేగానికి గురయ్యారు. తమ పిల్లలు క్షేమంగా తిరిగి వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. కాగా ఇండియా వచ్చిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తాము చాలా సంతోషంగా ఉన్నామని, తమ కుటుంబాన్ని కలిసిన తర్వాత ఆనందంతో మాటలు రావడం లేదని అన్నారు. కాగా ఇరాన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, యుద్ధం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇరాన్ లో దాదాపు 13 వేల మందికిపైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఇరాన్ అధికారులతో సంప్రదింపులు చేస్తోంది. మరోవైపు ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆరెండు దేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులకు సాయం అందించేందుకు సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది.