Iran- Israel War: ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ 15 విమానాలు ధ్వంసం

Israel Attack On Airports: ఇరాన్ లోని వైమానిక స్థావరాలను టార్గెట్ చేస్తూ తాము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రకటన చేసింది. పశ్చిమ, తూర్పు, సెంట్రల్ ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న సుమారు 6 ఎయిర్ పోర్టులపై ఇజ్రాయెల్ మిలిటరీ అటాక్ చేసినట్టు ఐడీఎఫ్ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసింది. రిమోట్ ఎయిర్ క్రాఫ్ట్ లతో జరిగిన దాడిలో సుమారు 15 ఇరాన్ విమానాలు, హెలికాప్టర్లు ధ్వంసం అయినట్టు ఐడీఎఫ్ చెప్పింది. దాడులతో విమానాశ్రయంలో రన్ వేలు, అండర్ గ్రౌండ్ బంకర్లు, రీఫ్యూయలింగ్ విమానం, ఎఫ్-14, ఎఫ్-5, ఏహెచ్-1 విమానాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. టార్గెట్ చేసిన విమానాశ్రయాల్లో మెహ్రబాద్, మాషద్, డెజ్ పుల్ ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ విమాన రాకపోకలు నిలిచేలా ఇజ్రాయెల్ దాడులు చేసింది.
కాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 20 యుద్ధ విమానాలు.. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా దాడులు చేసినట్టు ఐడీఎఫ్ తెలిపింది. కెర్మన్షా, హమేదీన్, టెహ్రాన్ సైట్లపై 30 బాంబులతో ఇజ్రాయెల్ దాడి చేసింది. మిస్సైల్ స్టోరేజ్, లాంచ్ కేంద్రాలతో పాటు రాడార్, శాటిలైట్ సిస్టమ్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ లాంచర్ కేంద్రంపై దాడి చేసినట్టు ఐడీఎఫ్ చెప్పింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిలువరించడంతో పాటు ఇజ్రాయెల్ పౌరులపై వైమానిక దాడులు చేయకుండా ఉండేందుకు అటాక్ చేసినట్టు ఐడీఎఫ్ వివరించింది.