Last Updated:

Kerala gold smuggling: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: రూ. 1.13 కోట్ల విలువైన ఆస్తులను, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న ఈడీ

దౌత్య మార్గాల ద్వారా కేరళలోకి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై ఇటీవల జరిపిన సోదాల తర్వాత రూ.1.13 కోట్ల విలువైన ఏడు స్థిరాస్తులు, రూ.27.65 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం వెల్లడించింది.

Kerala gold smuggling: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: రూ. 1.13 కోట్ల విలువైన ఆస్తులను, బంగారాన్ని  స్వాధీనం చేసుకున్న ఈడీ

Kerala gold smuggling: దౌత్య మార్గాల ద్వారా కేరళలోకి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై ఇటీవల జరిపిన సోదాల తర్వాత రూ.1.13 కోట్ల విలువైన ఏడు స్థిరాస్తులు, రూ.27.65 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం వెల్లడించింది.

కేరళ, తమిళనాడులో ఈడీ సోదాలు..(Kerala gold smuggling)

ఏప్రిల్ 13న కేరళ, తమిళనాడులోని నాలుగు స్థావరాలపై దాడులు చేశామని, ఇవి కేజీఎన్ బులియన్ యజమాని నందు అలియాస్ నందగోపాల్, సంజూ టీఎం, అతని బావ శంసుధీన్‌లకు చెందినవని ఈడీ తెలిపింది. ఈ సోదాల్లో రూ.1.13 కోట్ల విలువైన ఏడు స్థిరాస్తులు, రూ.27.65 లక్షల విలువైన బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.సంజుయొక్క స్టేట్‌మెంట్ రికార్డ్ చేయబడింది. అతను మహ్మద్ షఫీ (స్మగ్లర్) నుండి 4,500 గ్రాముల స్మగ్లింగ్ బంగారాన్ని సేకరించినట్లు అంగీకరించాడు, దానిని తన మామగారి దుకాణం ద్వారా వినియోగదారులకు విక్రయించాడని ఈడీ తెలిపింది.

మూడు దర్యాప్తు సంస్దల విచారణ..

గత ఏడాది జులై 5న తిరువనంతపురం విమానాశ్రయంలోని యూఏఈ కాన్సులేట్‌లోని దౌత్య సామాను నుంచి సుమారు రూ.15 కోట్ల విలువైన 30.24 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న నేపధ్యంలో ఈ రాకెట్‌పై ఈడీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), కస్టమ్స్ విభాగం వేర్వేరుగా విచారణ జరుపుతున్నాయి.ఈ కేసులో ప్రధాన నిందితులైన స్వప్న సురేశ్, కేరళలోని యూఏఈ కాన్సులేట్‌లో మాజీ ఉద్యోగులు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం శివశంకర్‌తో పాటు సందీప్ నాయర్‌లను ఈడీ అరెస్ట్ చేసింది.మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఏజెన్సీ వారిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, ఆ తర్వాత అనుబంధ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు చేసింది.