Last Updated:

Kavitha vs Sukesh: ‘కేజ్రీవాల్, కవితక్క.. వెల్ కమ్ టూ తీహార్ క్లబ్’

నన్ను దొంగ, ఆర్థిక నేరగాడని విమర్శించారు. మీరు కూడా అందులో భాగస్వాములే. దమ్ముంటే నాతో చాట్ సంబాషణలపై సీఐడీ, ఈడీలతో విచారణ జరిపించాలి.

Kavitha vs Sukesh: ‘కేజ్రీవాల్, కవితక్క.. వెల్ కమ్ టూ తీహార్ క్లబ్’

Kavitha vs Sukesh: మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవత మధ్య లేఖల యుద్దం కొనసాగుతూనే ఉంది. తాజాగా తీహార్ జైలు నుంచి మరో లేఖను విడుదల చేశాడు. ఈ లేఖలో కవితపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. వాట్సాప్ లో తాను చాట్ చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతోనే అంటూ స్పష్టం చేశాడు. అంతకుముందు సఖేష్ వాట్సాప్ చాట్ స్క్రీన్లు రిలీజ్ చేయడం.. వాటికి సుఖేష్ ఎవరో తెలియదంటూ కవిత స్పందించారు. ఈ నేపథ్యంలో 5 పేజీల లేఖను రిలీజ్ చేసి.. కవిత పై విమర్శలు చేశాడు.

 

కవితను నా పెద్దక్కగా భావించా(Kavitha vs Sukesh)

‘నేను చాట్ చేసింది ఎమ్మెల్సీ కవితక్కతోనే. కవిత నాకు బాగా తెలుసు. కవితక్క దమ్ముంటే విచారణను ఎదుర్కోండి. నాకు తెలుగు తెలియదని ప్రచారం చేస్తున్నారు. నా మాతృభాష తెలుగు, తమిళం అని స్పష్టత ఇస్తున్నా. నా చిన్నప్పటి నుంచి ఇంట్లో తెలుగు, తమిళం మాట్లాడతారు. టీఆర్ఎస్ నాయకులు.. అసలు సమస్య నుంచి దారి మళ్లించడానికి మాత్రమే ఇలాంటి చిన్న విషయాలు లేవనెత్తుతారు. జైలు నుంచి సుఖేష్ ఎలా వాట్సాప్ చాట్స్ పంపుతున్నాని ప్రశ్నిస్తున్నారు. ఒకటి చెప్పదలచుకున్నా ఫొటోలు. వీడియోలు నా టీమ్ దగ్గర ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల అభ్యర్థన ఆధారంగా , బయట ఉన్న నా టీమ్ అన్ని ఆధారాలను ఇస్తుంది. కవితక్క నేను ఎవరో తెలియదన్నారు. ఆమెను నేను ఎల్లప్పుడూ అక్కగానే గౌరవిస్తాను. ఆమెను నా పెద్దక్కగా భావించాను. కానీ ప్రజా ప్రయోజనాల కోసం నిజం మాట్లాడుతున్నాను. కానీ కవితక్క నేను ఎవరో తెలియదని చెబుతారని అనుకోలేదు. కవితపై గౌరవంతోనే ఆమె పేరును కవితక్క అని సేవ్ చేసుకున్నా. కవితక్కకు చెందిన రెండు ఫోన్ నెంబర్లు 91-6209999999, 8985699999 నా ఫోన్ లో కవితక్క అని సేవ్ చేసుకున్నా’ అని సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా మరో చాట్‌లో సత్యేంద్ర జైన్‌ వ్యక్తిగత ఫోన్‌ నెంబర్‌ 919810154102 గా లెటర్‌లో రాసుకొచ్చాడు సుఖేష్‌.

2 చాట్స్ మాత్రమే బయటపెట్టా

‘నన్ను దొంగ, ఆర్థిక నేరగాడని విమర్శించారు. మీరు కూడా అందులో భాగస్వాములే. దమ్ముంటే నాతో చాట్ సంబాషణలపై సీఐడీ, ఈడీలతో విచారణ జరిపించాలి. కోర్టు ధుృవీకరణ ఎవిడెన్స్ చట్టం 65-బి కింద స్క్రీన్ షాట్స్ ను విడుదల చేశాను. కవితకు రూ. 15 కోట్ల డెలివరీ తర్వాత ఫేస్ టైంలో కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ తో మాట్లాడిన స్క్రీన్ షాట్లను కూడా విడుదల చేస్తాను. త్వరలోనే కేజ్రీవాల్ తో చేసిన చాట్ ను విడుదల చేస్తా. మొత్తం 703 చాట్స్ ఉన్నాయి. అందులో కేవలం 2 చాట్స్ మాత్రమే బయటపెట్టాను.కేజ్రీవాల్ తర్వాత నీ వంతే. తీహార్ క్లబ్ కు కవితక్కను, కేజ్రీవాల్ ను స్వాగతిస్తున్నా. నన్ను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారన్న విమర్శలు కొట్టిపారేస్తున్నా. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తాను. నేను నిర్దోషిగా బయటపడాలని అనుకుంటున్నాను. మీరు కూడా సీబీఐ, ఈడీ విచారణకు సహకరించండి’ అని సుఖేష్ సవాల్ విసిరాడు.