Last Updated:

Balasore: ఒడిషాలోని బాలాసోర్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు.. . కర్ఫ్యూ విధింపు

  ప్రశాంతంగా ఉన్న ఒడిషాలో మత ఘర్షణలు చెలరేగాయి. స్థానికంగా వచ్చే నీరు కాస్తా ఎర్రగా మారడంతో బక్రీద్‌ సందర్భంగా గో హత్య జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Balasore: ఒడిషాలోని బాలాసోర్ లో  రెండు వర్గాల మధ్య ఘర్షణలు.. . కర్ఫ్యూ విధింపు

Balasore:  ప్రశాంతంగా ఉన్న ఒడిషాలో మత ఘర్షణలు చెలరేగాయి. స్థానికంగా వచ్చే నీరు కాస్తా ఎర్రగా మారడంతో బక్రీద్‌ సందర్భంగా గో హత్య జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఒడిషాలో బాలసోర్ పట్టణంలో మత ఘర్షణలు చెలరేగాయి. వెంటనే అధికారులు కర్ఫ్యూ విధించారు. ఘర్షణలకు సంబంధించి 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరు మతాల వారు శాంతిని పాటించాలని ముఖ్యమంత్రి పిలువునిచ్చారు. బక్రీద్‌ సందర్భంగా సోమవారం ఉదయం ఒడిషాలోని బాలసోర్‌లో గోహత్య జరిగిందంటూ పుకార్లు చెలరేగడంతో ఇరు మతాల వారు సోమవారం రాత్రి ఘర్షణకు దిగారు.

ఘర్షణలు ప్రారంభమైన వెంటనే జిల్లా అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఎంతకు పరిస్థితి అదుపులోకి రాకపోయే సరికి ఘర్షణలు నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జిల్లా యంత్రాగం కర్ఫ్యూ విధించింది. బాలాసోర్‌ పట్టణంలో నిషేధాజ్ఞలు విధించిన తర్వాత ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగినట్లు వార్తలు రాలేదు. ముందు జాగ్రత్త చర్యగా బాలాసోర్‌ పట్టణం మొత్తం కర్ఫ్యూ విధించినట్లు జిల్లా కలెక్టర్‌ అశిష్‌ థకారె చెప్పారు. ఇదిలా ఉండగా బాలాసోర్‌ పట్టణంతో పాటు దానికి ఆనుకునన ఉన్న చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.

43 ప్లాటూన్ల బలగాలు..(Balasore)

ఇదిలా ఉండగా అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ లా అండ్‌ ఆర్డర్‌ సంజయ్‌కుమార్‌ పట్టణంలోనే క్యాంప్‌ వేసి ఉన్నారు. ఇరు మతాలకు చెందిన 34 మందిని అదుపులోకి తీసుకున్నామని.. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పరిస్థితి అదుపు తప్పకుండా ముందు జాగ్రత్త చర్యగా 43 ప్లాటూన్ల పోలీసులను బాలాసోర్‌కు రప్పించారు. అదనంగా 15 ప్లాంటూన్లకు కూడా సిద్దం చేస్తున్నారు. నలుగురు ఐపీఎప్‌ అధికారులతో పాటు సీనియర్‌ పోలీసు అధికారులను హెడ్‌క్వార్టర్స్‌ నుంచి రప్పిస్తున్నామని సంజయ్‌కుమార్‌ వివరించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా నిత్యావసర సేవలు, అంబులెన్స్‌ సర్వీసులను కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చామని ఆయన వివరించారు.

గోవధ జరిగిందన్న అనుమానంతో..

ప్రాథమిక విచారణలో తేలింది ఏమిటంటే ఉత్తర ఒడిషాలోని బాలాసోర్‌ పట్టణంలో స్థానిక రైల్లో నీరు ఎర్రగా రావడంతో మత ఘర్షణలు మొదలయ్యాయి. బక్రీద్‌ సందర్భంగా గోవులను హత్య చేయడం గోవుల రక్తం నీటిలో కలిసిందని కొంత మంది అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇరు మతాల మధ్య వాదోపవాదాలు మొదలయ్యాయి. తర్వాత రాళ్లు రువ్వుకోవడం జరిగింది. పోలీసుల లాఠీచార్జి ద్వారా పరిస్థితిని అదుపులోకి తేవాలని ప్రయత్నించి విఫలం అయ్యామని స్థానిక పోలీసులు చెప్పారు. రాళ్ల దాడిలో ఐదు మంది పోలీసులతో పాటు పౌరులు కూడా గాయపడ్డారు. కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి మోహన్‌ చరన్‌ మాజి బాలాసోర్‌ కలెక్టర్‌తో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తేవాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

 

 

 

 

ఇవి కూడా చదవండి: