Last Updated:

Odisha: టాటా స్టీల్ ప్లాంట్ లో గ్యాస్ లీక్.. 19 మందికి తీవ్ర గాయాలు

ఒడిశాలోని ఢెంకనాల్‌ జిల్లాలో టాటా స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మేరమాండల్‌ ప్రాంతంలో టాటా స్టీల్‌ కు చెందిన ‘బ్లాస్ట్‌ ఫర్నేస్‌ పవర్‌ ప్లాంట్‌’లో ప్రమాదకరమైన గ్యాస్‌ లీక్‌ అయినట్టు తెలుస్తోంది.

Odisha: టాటా స్టీల్ ప్లాంట్ లో గ్యాస్ లీక్.. 19 మందికి తీవ్ర గాయాలు

Odisha: ఒడిశాలోని ఢెంకనాల్‌ జిల్లాలో టాటా స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మేరమాండల్‌ ప్రాంతంలో టాటా స్టీల్‌ కు చెందిన ‘బ్లాస్ట్‌ ఫర్నేస్‌ పవర్‌ ప్లాంట్‌’లో ప్రమాదకరమైన గ్యాస్‌ లీక్‌ అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. బాధితులను కటక్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఢెంకనాల కలెక్టర్‌ స్టీల్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.

 

స్పందించిన టాటా స్టీల్(Odisha)

ప్రమాదంపై టాటా స్టీల్‌ స్పందించింది. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ‘మేరమాండల్‌లోని టాటా స్టీల్‌ వర్క్స్‌ ఫ్యాక్టరీలో బీఎఫ్‌పీపీ2 పవర్‌ ప్లాంట్‌ వద్ద స్ట్రీమ్ లీక్‌ కారణంగా ప్రమాదం సంభవించింది. మంగళవారం మధ్యాహ్న ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అన్ని అత్యవసర ప్రొటోకాల్‌ సర్వీసులను యాక్టివేట్‌ చేశాం. ఘటన జరిగిన ప్రాంతాన్ని సీజ్‌ చేశాం. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాం’ అని టాటా స్టీల్‌ వెల్లడించింది. ఘటనపై సంబంధిత అధికారులతో కలిసి ఇంటర్నెల్ గా దర్యాప్తును ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. అయితే ఎంతమంది గాయపడ్డారనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.