Naveen Patnaik: పాండ్యన్ నా వారసుడు కాదు.. నవీన్ పట్నాయక్
ఒడిషాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు నవీన్‌పట్నాయక్. ఆయన రాజకీయ వారసుడు వీకె పాండ్యన్ అనే టాక్ గత కొంత కాలంగా రాష్ర్టం మొత్తం వినిపిస్తోంది.
Naveen Patnaik: ఒడిషాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు నవీన్‌పట్నాయక్. ఆయన రాజకీయ వారసుడు వీకె పాండ్యన్ అనే టాక్ గత కొంత కాలంగా రాష్ర్టం మొత్తం వినిపిస్తోంది. అయితే శనివారం నాడు బీజేడీ చీఫ్ తన వారసుడు పాండ్యన్ కాదని, రాష్ర్ట ప్రజలే నిర్ణయిస్తారని నవీన్ పట్నాయక్ అన్నారు. ఇక పాండ్యన్ విషయానికి వస్తే 2000 సంవత్సరం ఐఎఎస్ బ్యాచ్ అధికారి గత రెండు దశాబ్దాల నుంచి నవీన్‌పట్నాయక్‌కు ప్రైవేట్ సెక్రటరీగా సేవలందించారు. ఆయన స్వచ్చంద పదవీ విరమణ చేసి బీజేడీ పార్టీలో చేరారు.
ప్రజలే నిర్ణయిస్తారు..(Naveen Patnaik)
ఇదిలా ఉండగా నవీన్ పట్నాయక్ శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ పాండ్యన్ వైద్య, విద్య, క్రీడలతో పాటు దేవాలయాల పునరుద్దరణ కోసం తనతో కలిసి పనిచేశారని చెప్పారు. పాండ్యన్ అ పార్టీలో చేరినా.. ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని గుర్తు చేశారు. తనతో చాలా మంది తన రాజకీయ వారసుడు ఎవరూ అని ప్రశ్నస్తుంటారు. దానికి తాను స్పష్టంగా తన వారసుడు పాండ్యన్ కాదని పలుమార్లు చెప్పానని గుర్తు చేశారు. మరోసారి ఇదే చెబుతున్నాను. ప్రజలే తన వారసుడిని నిర్ణయిస్తారని నవీన్ బాబు అన్నారు. కాగా ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ చేతిలో బీజేడీ ఘోర పరాజయం పాలయ్యింది. 24 ఏళ్ల సుదీర్ఘపాలనకు ముగింపు పలికింది. ఇక నవీన్ పట్నాయక్ ఒడిషా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై చూపించిన ప్రేమ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మంచి పనులు చేశామని గుర్తు చేశారు. బీజేడీ ఓటమి గురించి ప్రస్తావిస్తూ.. అది ప్రజల చేతల్లో ఉంది. ప్రజాస్వామ్యంలో ఒక సారి మీరు గెలుస్తారు.. మరోసారి ఓడుతారని ఆయన వేదాంత ధోరణలో అన్నారు. దీర్ఘకాలం తర్వాత ఓటమిని చవిచూశామన్నారు. ప్రజల తీర్పును హుందాగా స్వీకరించాల్సిందేనని ఆయన అన్నారు.
రాష్ర్టంలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజలు తన కుటుంబం … వారికి తాను యధావిధిగా సేవ చేస్తానని అన్నారు. అయితే ఇటీవల కాంలంలో పాండియన్ వచ్చిన విమర్శలపై ఆయన స్పందించారు. ఆయనపై విమర్శలు రావడం దురదృష్టం. ఎందుకంటే రాష్ర్టాన్ని రెండు తుఫానులు అతలాకుతలం చేశాయి. అలాగే కోవిడ -19 సందర్భంగా ఆయన అద్బుతంగా పనిచేశారు. అటు తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. నిజాయితీ గల అధికారి అని పాండ్యన్ కు కితాబు ఇచ్చారు.ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో 147 సీట్లకు గాను బీజేపీ 78 సీట్లు గెలుచుకోగా.. బీజేడీ 51 సీట్లు గెలిచింది.కాగా మెజారిటీ మార్కు 74. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు సాధించింది. ఇక లోకసభ ఎన్నికల విషయానికి వస్తే మొత్తం 21 లోకసభ స్థానాలకు గాను బీజేపీ 20 సీట్లు గెలుచుకోగా..కాంగ్రెస్ ఒక సీటు కైవసం చేసుకుంది.