Last Updated:

IT Raids: ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ నివాసాల్లో ఐటీ దాడులు.. రూ.100 కోట్ల నగదు స్వాధీనం

శుక్రవారం ఒడిశాలో కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు రూ.100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్‌లోని సాహు నివాసాలపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.

IT Raids: ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ నివాసాల్లో ఐటీ దాడులు.. రూ.100 కోట్ల నగదు స్వాధీనం

IT Raids: శుక్రవారం ఒడిశాలో కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు రూ.100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్‌లోని సాహు నివాసాలపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.

డబ్బు లెక్కింపుకు కౌంటింగ్ మెషిన్లు..(IT Raids)

ఆదాయపు పన్ను శాఖ వర్గాల సమాచారం ప్రకారం, ఒడిశాలోని బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ప్రాంగణాల్లో దాడులు కొనసాగుతున్నాయి. అక్కడ నుండి నగదు రికవరీ చేయబడింది.సంబల్‌పూర్, బొలంగీర్, టిట్లాఘర్, బౌధ్, సుందర్‌ఘర్, రూర్కెలా మరియు భువనేశ్వర్‌లలో దాడులు జరుగుతున్నాయి.పట్టుబడిన డబ్బుల లెక్కింపుకు బ్యాంకు సిబ్బందితో పాటు 30 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. కరెన్సీల లెక్కింపునకు ఎనిమిదికి పైగా కౌంటింగ్ మెషిన్లను ఉపయోగిస్తున్నారు. కౌంటింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు మరో మూడు యంత్రాలను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు 150 కరేన్సీ ప్యాకెట్లు బొలంగీర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ బ్రాంచ్‌కు పంపించారు. ఒక అల్మారా నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు.భువనేశ్వర్‌లో జరుగుతున్న దాడులను పర్యవేక్షిస్తున్న ఆదాయపు పన్ను డైరెక్టర్ జనరల్ సంజయ్ బహదూర్, స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశోధిస్తున్నారని చెప్పారు.సుందర్‌గఢ్ నగరంలోని ఇల్లు, కార్యాలయం మరియు దేశీయ మద్యం డిస్టిలరీ, భువనేశ్వర్‌లోని బిడిపిఎల్ యొక్క కార్పొరేట్ కార్యాలయం, కంపెనీ అధికారుల ఇళ్లు, రాణిసతి రైస్ మిల్లుతో పాటు బౌధ్ రామ్‌చికటాలోని ఫ్యాక్టరీ మరియు కార్యాలయాల్లో ఐటి దాడులు కొనసాగుతున్నాయి. ధీరజ్ సాహు కుటుంబం మద్యం తయారీ వ్యాపారంలో ఉంది.అతనికి ఒడిశాలో అనేక మద్యం తయారీ కర్మాగారాలు ఉన్నాయి.