Prime Minister Modi’s Residence: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. నో ప్లయింగ్ జోన్లో డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఎస్పీజీ సమాచారం ఇచ్చింది. డ్రోన్ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Prime Minister Modi’s Residence: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. నో ప్లయింగ్ జోన్లో డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఎస్పీజీ సమాచారం ఇచ్చింది. డ్రోన్ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదంగా ఏమీ లేదు.. (Prime Minister Modi’s Residence)
ప్రధాని నివాసంపై గుర్తుతెలియని డ్రోన్ గురించి సమాచారం అందుకున్న తర్వాత, పోలీసులు రంగంలోకి దిగినా ఇప్పటివరకు ఏమీ కనుగొనలేకపోయారు. అనుమానాస్పదంగా ఏమీ కనబడలేదు. ప్రధాని నివాసంపై డ్రోన్ లాంటి వస్తువు ఎగురుతున్నట్లు ఉదయం 5 గంటలకు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు.అయితే, పోలీసులు మరియు ఇతర భద్రతా ఏజెన్సీలు అనుమానాస్పదంగా ఏమీ కనుగొనలేదని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ( ఏటీసీ ) కూడా ఏమీ కనుగొనలేదని సీనియర్ అధికారి తెలిపారు.
ప్రధానమంత్రి నివాసానికి సమీపంలో ఒక గుర్తుతెలియని ఎగిరే వస్తువుకు సంబంధించి NDD కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. సమీప ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు చేశారు, కానీ అలాంటి వస్తువు ఏదీ కనుగొనబడలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ని కూడా సంప్రదించారు. వారు కూడా గుర్తించలేదని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- Rahul Gandhi in Khammam: బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ.. ఖమ్మం జనగర్జన సభలో రాహుల్ గాంధీ
- World’s Oldest Daily Newspaper: ప్రపంచంలోనే అత్యంత పురాతన వార్తాపత్రిక ప్రింటింగ్ నిలిచిపోయింది.. ఎక్కడో తెలుసా?