Last Updated:

Rahul Gandhi in Khammam: బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ.. ఖమ్మం జనగర్జన సభలో రాహుల్ గాంధీ

బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేసారు. ఆదివారం సాయంత్రం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ను బీజేపీ కి బి టీమ్ గా అభివర్ణించారు.

Rahul Gandhi in Khammam: బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ..  ఖమ్మం జనగర్జన సభలో రాహుల్ గాంధీ

Rahul Gandhi in Khammam: బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేసారు. ఆదివారం సాయంత్రం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ను బీజేపీ కి బి టీమ్ గా అభివర్ణించారు. తెలంగాణలో ఇపుడు పోటీ కాంగ్రెస్ కు, బీజేపీ బి టీమ్ కు మాత్రమే నని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఖతమయిందని అడ్రస్ లేకుండా పోయిందన్నారు. తెలంగాణలో కారు నాలుగు టైర్లు పంక్చర్ అయ్యాయని అన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుందని కాని బీఆర్ఎస్ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలన్నింటిని సమర్దిస్తుందన్నారు. కేసీఆర్ అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు కేంద్ర సంస్దల వద్ద ఉన్నాయని ఆయన రిమోట్ మోదీ చేతిలో ఉందన్నారు. ఢిల్లీలో విపక్షాల సమావేశం జరిగినపుడు బీఆర్ఎస్ ను పిలవాలని కోరగా బీఆర్ఎస్ వస్తే కాంగ్రెస్ రాదని చెప్పామని రాహుల్ అన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి బి టీమ్ అని వారి పక్కన కూర్చోమని వారితో ఎటువంటి ఒప్పందం ఉండదని చెప్పామని పేర్కొన్నారు.

చేయూత ద్వారా ప్రతీ నెలా రూ.4వేల పెన్షన్..(Rahul Gandhi in Khammam:)

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్దులు. వితంతువులకు ప్రతీనెలా రూ.4 వేల పెన్షన్ అందిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆదివాసీలకు పోడుభూమలుకు పట్టాలిస్తామని చెప్పారు. రైతులు , నిరుపేదలకు తెలంగాణ స్వప్నమని బీఆర్ఎస్ ఈ స్వప్నాన్ని భగ్నం చేసిందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు రాజుగా భావిస్తున్నారు. తన జాగీరుగా తలుస్తున్నారు. దళితులు. ఆదివాసీలు,పేదలకు ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కుంటున్నారు. ఈ భూముల విషయం భారత్ జోడో యాత్రలో కూడా నా దృష్ఠికి తెచ్చారు. ఈ భూములు కేసీఆర్ వి కావు. మీవి. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్లు రూపాయల అవినీతికి జరిగింది. దరణి పోర్టల్ గురించి భారత్ జోడో యాత్ర సమయంలో మీరు నాకు చెప్పారు.మిషన్ భగీరధ లో వేలకోట్లు దోచుకున్నారు. రైతులు, దళితులు, ఆదివాసీలు, యువతను సీఎం కేసీఆర్ దోచుకున్నారని రాహుల్ ఆరోపించారు. కర్ణాటకలో అవినీతి, నిరుపేదల వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించింది. కర్ఱాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రతీ కుటుంబం నిలిచింది. తెలంగాణలో కూడా ఈ విధంగా జరగబోతోంది. ఒక పక్క సీఎం, ఆయన కుటుంబ సభ్యులు, కాంట్రాక్టర్లు.. మరోపక్క రైతులు, దళితులు. ఆదివాసీలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారు. కర్ణాటక ఫలితమే తెలంగాణలో రిపీటవుతుందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి వెన్నెముక.మీ శక్తిని చూపించి బీఆర్ఎస్ ను ఓడించాలని రాహుల్ పిలుపు నిచ్చారు. నేను యాత్రలోచెప్పినట్లుగా విద్వేషం ఉన్న మార్కెట్లో ప్రేమ దుకాణాలను తెరిచామని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ నచ్చిన వారు, పార్టీని వీడిని వారు తిరిగి రావచ్చని వారికి కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని వారిని అండమాన్ కు తరమాలని అన్నారు.యువత బలిదానాలు చూడలేకే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని విజయోత్సవ సభ జరుగుతుందన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ జోడోయాత్రకు కొనసాగింపే తన పీపుల్స్ మార్చ్ యాత్ర అన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానని పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకున్నానని అన్నారు.కాంగ్రెస్ సందేశాన్ని మారుమూల ప్రదేశాలకు తీసుకెళ్లానని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అంతకుముందు 1300 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ అభినందించి సత్కరించారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు ఆయన అనుచరులు. ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా గాయకుడు గద్దర్ ఈ సభకు హాజరై రాహుల్ గాంధీని పలకరించి ముద్దాడారు.