Dimple Yadav: మెయిన్‌పురి ఉప ఎన్నికకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్
ఉత్తరప్రదేశ్ లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్ పేరును పార్టీ గురువారం ప్రకటించింది. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి డిసెంబర్ 5న ఉప ఎన్నిక జరగనుంది.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్ పేరును పార్టీ గురువారం ప్రకటించింది. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి డిసెంబర్ 5న ఉప ఎన్నిక జరగనుంది.
“మెయిన్‌పురి ఉపఎన్నిక పార్టీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్‌ను పార్టీ ప్రకటించింది” అని సమాజ్‌వాదీ పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొంది. ములాయం సింగ్ యాదవ్ 82 ఏళ్ల వయసులో అక్టోబర్ 10న గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని ఆయన స్వగ్రామమైన సైఫాయి గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.