Published On:

Children Vitamin Deficiency: పిల్లలు విటమిన్ లోపంతో బాధపడుతున్నారా..? వేంటనే వీటిని ఆహారంలో చేర్చండి!

Children Vitamin Deficiency: పిల్లలు విటమిన్ లోపంతో బాధపడుతున్నారా..? వేంటనే వీటిని ఆహారంలో చేర్చండి!

Children Vitamin Deficiency: పిల్లలు కాస్త నీరసంగా కనిపించినా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలం ఎక్కువగా పిల్లలు జబ్బుపడతారు. జ్వరం, జలుబు (సర్ది)పిల్లలను ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. పిల్లలకు ఈ సమస్యలు తగ్గాలంటే వారి డైట్ లో కొన్ని ఆహారం పదార్థాలను చేర్చాలి. పిల్లలు కాస్త ఎదిగేంత వరకు ప్రతీ చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. వాళ్లు ఏం తీసుకుంటున్నారు. ఎప్పుడు తింటున్నారు అనే విషయాన్ని గమనించాలి. పిల్లలకు ఎదిగే వయసులోనే కావల్సిన పోషకాలు కచ్చితంగా అందాలి. విటమిన్స్ సరైన విధంగా అందితేనే ఆరోగ్యంగా ఉంటారు.

 

 

సాధారణంగా పిల్లల్లో వర్షాకాలం లేదా చలికాలంలో జలుబు వస్తుంది. విటమిస్ సి లోపం కారణంగా కూడా జలుబుకు లోనవుతారు. విటమిన్ లోపం ఉన్న పిల్లలు కాలంతో పనిలేకుండా జలుబు బారిన పడే అవకాశం ఉంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎప్పుడూతే ఇది తక్కువగా ఉంటుందో పిల్లలు జ్వరానికి, జలుబుకు లోనవుతారు. విటమిన్ సి పుష్కలంగా పిల్లలకు దక్కాలంటే జామ, ఉసిరి, నారింజ, కివి, క్యాప్సికమ్ ఎక్కువగా ఇవ్వాలి. ముందుగా మన భూభాగంలో పండినవి తినిపిస్తే చాలా మంచిది.

 

 

కొందరు పిల్లల్లో జింక్, ఐరన్ సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి వారికి పల్లీలు, శనగలు తినిపించాలి. బెల్లంతో చేసిన పల్లీ పట్టీలు ( చెక్కీలు) తినిపించాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. వీటితో పాటు కాజూ, డేట్స్, పాలకూర, రాజ్మా ఆహారంలో భాగం చేయాలి. దీంతో పిల్లలకు ఐరన్ కావలసినంతగా అందుతుంది. కొందరు పిల్లల్లో పెరుగుదల అనేది ఉండదు, మరికొందరు పిల్లల్లో పెరుగుదల మంచిగా ఉంటుంది. ఇలాంటి పిల్లలకు విటమిన్ డి లోపం ఉంటుంది. వీరికి నువ్వులు, పాలు, గుడ్లు, బఠానీలు రోజూ తినిపించాలి. సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి.

 

 

పెదవులు ఎండిపోతున్న పిల్లలకు ఐరన్ లోపం ఉందని అర్థం. వీరికి పెరుగు తప్పినిసరిగా ఇవ్వాలి. బెల్లం , కిస్ మిస్, పాలు వీరికి చాలా అవసరం. పళ్లలో తరచూ సమస్సలు వస్తుంటే కాల్షియం, విటమిన్ డి తక్కువగా ఉన్నట్లు. పెరుగు, రాగులు, నువ్వులను ఏదో రూపంలో ఇవ్వాలి. ప్రతీ రోజు ఎండకు ఆడుకునేలా చేడటం మంచిది. వీటితో పాటు క్యారెట్, బొప్పాయి, ఓట్స్, బఠానీలు, సోయా బీన్స్, గుడ్లు, అరటి పండ్లు ఇస్తూ ఉంటే విటమిన్ ఎ, బి6, బి12 లోపాలను శరీరం సరిచేసుకుంటుంది.

 

గమనిక.. పై చెప్పిన విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇవి ఏవిధంగాను మెడిసిన్ కు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించే ముందు డాక్టర్ సలహాను తప్పక తీసుకోగలరు. ఖచ్చితమైన రిజల్ట్ కోసం చానల్ బాధ్యత వహించదు.

ఇవి కూడా చదవండి: