Published On:

Weight Loss: చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ 5కిలోల బరువును తగ్గండిలా.! న్యూట్రీషన్స్ చెప్పే టిప్స్..!

Weight Loss: చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ 5కిలోల బరువును తగ్గండిలా.! న్యూట్రీషన్స్ చెప్పే టిప్స్..!

Weight Loss Tips: బరువు తగ్గాలనుకోవడం చాలా మంచింది. అతి బరువు ఉన్నవారే సుమా..! బరువును తగ్గించుకోవడం అంటే ఆరోగ్యానికి మనం మేలు చేస్తున్నామనే అర్థం. అయితే న్యూట్రీషన్లు చెప్పిన విధంగా తక్కువ సమయంలో 5కిలోలు తగ్గాలనుకుంటే ఈ చిట్కాలు పాటించాలి.

 

అన్ని రోగాలకు ముఖ్యకారణం బరువే. ఆ బరువుకు ఆహారపు అలవాట్లు వ్యాయామం చేయకపోవడం ఇలా ప్రతీదీ కారణమవుతుంది. అయితే బరువును తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు చాలా మంది చాలా రకాలైన పద్దతును పాటిస్తారు. కొంతమంది జిమ్ కు వెళ్లి వ్యాయామాలు చేస్తే, మరికొందరు మెడిసిన్స్ తీసుకుంటారు. అయితే ఇవేవీ లేకుండా చిన్న చిన్న టిప్స్ తో బరువును కంట్రోల్ చేయవచ్చని అంటున్నారు న్యూట్రీషన్లు.

 

 

ఆహారం తీసుకోవడంలో చిన్న మార్పులు
భోజనాన్ని గాబరాగా చేస్తుంటారు చాలా మంది. ఏదో పనిమీద ఉన్నవాళ్లు అలా చేసారంటే అది ఏదో ఒకసారి అని సరిపెట్టుకోవచ్చు. కానీ చాలా మంది ఏకారణం లేకుండా అదే విధంగా ఫాస్ట్ గా తింటుంటారు. అలా తినడం వలన తెలియకుండానే ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. దీంతో ఆహారాన్ని సరిగ్గా నమల కుండా తిన్నట్లవుతుంది. ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా ఒక్కో ముద్దని కనీసం 20సార్లు నమిలి తిన్నట్లయితే ఎక్కువ తిన్న ఫీలింగ్ ను మెదడు తీసుకుంటుంది. దీంతో ఆహారం తక్కువ తీసుకున్నా కడుపు నిండినట్లవుతుంది. బరువు తగ్గడంలో ఇది చాలా సహాయం చేస్తుంది.

 

 

జిమ్ లో ఎక్కువ కష్టపడితే ఫ్యాట్ బర్న్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి జిమ్ లో కష్టపడటంతో పాటు శరీరానికి వయస్సుకు తగ్గట్లుగా నిద్ర పోవాలి. మామూలుగా 8 గంటల నిద్రను పోయినట్లయితే ఫ్యాట్ బర్న్ అవుతుంది. ప్రతీ రోజు 24 గంటలకుగాను 12 గంటలు శరీరానికి ఆహారాన్ని ఇవ్వకండి. ఇందులో 8 గంటలు పడుకునే ఉంటారు. కాబట్టి పడుకోవడానికి 2 గంటల ముందు నిద్ర లేచాక 2 గంటల పాటు శరీరానికి ఆహారాన్ని ఇవ్వకండి. ఈ చిన్న టిప్స్ పాటిస్తే తక్కువ టైంలోనే ఎక్కువ బరువును తగ్గవచ్చు.

 

 

ఇవి కూడా చదవండి: