Last Updated:

cash-for-query: ప్రశ్నకు నోటు వ్యవహారం.. ముసాయిదా నివేదికను సమర్పించిన ఎథిక్స్ కమిటీ

లోక్ సభలో ప్రశ్నకు నోటు వ్యవహారం జాతీయ రాజకీయాల్ని కుదిపేస్తోంది. పారిశ్రామిక వేత్త దర్శన్ హీరానందానీకి తన లోక్ సభ లాగిన్ ఐడీ షేర్ చేయడం ద్వారా ప్రశ్నకు నోటు తీసుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ ముసాయిదా నివేదికను సమర్పించింది.

cash-for-query: ప్రశ్నకు నోటు వ్యవహారం..  ముసాయిదా నివేదికను సమర్పించిన ఎథిక్స్ కమిటీ

 cash-for-query:లోక్ సభలో ప్రశ్నకు నోటు వ్యవహారం జాతీయ రాజకీయాల్ని కుదిపేస్తోంది. పారిశ్రామిక వేత్త దర్శన్ హీరానందానీకి తన లోక్ సభ లాగిన్ ఐడీ షేర్ చేయడం ద్వారా ప్రశ్నకు నోటు తీసుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ ముసాయిదా నివేదికను సమర్పించింది.

లోక్‌సభ నుండి బహిష్కరించాలని ..( cash-for-query)

టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ప్రశ్నకు నోటు ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. అనంతరం ముసాయిదా నివేదికలో ఆమెను 17వ లోక్‌సభ నుండి బహిష్కరించాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. నివేదికను ఆమోదించేందుకు ఎథిక్స్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఆ తర్వాత లోక్‌సభ స్పీకర్‌కు పంపుతారు. ముసాయిదా నివేదిక, పార్లమెంటరీ కమిటీల కార్యకలాపాల గోప్యతకు సంబంధించిన విధివిధానాలు, ప్రవర్తన రూల్స్ 275 రూల్ 275ను ఉల్లంఘించినందుకు బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని హెచ్చరించినట్లు తెలుస్తోంది.ఎథిక్స్ కమిటీ సమావేశంలో ప్యానెల్ చైర్మన్ వినోద్ కుమార్ సోంకర్ మహువా మొయిత్రాను ప్రశ్నించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన అలీతో సహా పలువురు ప్రతిపక్ష ఎంపీల పేర్లను నివేదిక ప్రస్తావించింది. పాలక ఎన్‌డిఎకు మెజారిటీ ఉన్న 15 మంది సభ్యుల ప్యానెల్ సిఫార్సులతో విభేదిస్తూ ప్యానెల్‌లోని ప్రతిపక్ష సభ్యులు అసమ్మతి నోట్లు సమర్పించాలని భావిస్తున్నారు.

మొయిత్రాతో పాటు ఐదుగురు ప్రతిపక్ష సభ్యుల గురించి ఇందులో ప్రస్తావించారు. ఇందులో బీఎస్పీ ఎంపీ దానిష్ అలీ, కాంగ్రెస్‌కు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి వైతిలింగం, సిపిఎం పిఆర్ నటరాజన్, జెడి యుకి చెందిన గిరిధారి యాదవ్ నవంబర్ 2న ప్యానెల్ సమావేశంనుండి వాకౌట్ చేశారు. తెలంగాణలో నామినేషన్ దాఖలు చేయాల్సి ఉన్నందున నవంబర్ 9 సమావేశాన్ని వాయిదా వేయాలని ప్యానెల్ చైర్మన్ సోంకర్‌కు లేఖ రాసినట్లు నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ తెలిపారు.