Last Updated:

Vijay Devarakonda : రష్మిక మార్ఫింగ్ వీడియోపై విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే ?

సినీతార రష్మిక మందన్నకి సంబంధించిన మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో లిఫ్ట్ లోకి వచ్చిన రష్మిక తన ఎద అందాలని బాగా ఎక్స్‌పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. దీంతో రష్మిక ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడం ఏంటని అభిమానులు 

Vijay Devarakonda : రష్మిక మార్ఫింగ్ వీడియోపై  విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే ?

Vijay Devarakonda : సినీతార రష్మిక మందన్నకి సంబంధించిన మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో లిఫ్ట్ లోకి వచ్చిన రష్మిక తన ఎద అందాలని బాగా ఎక్స్‌పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. దీంతో రష్మిక ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడం ఏంటని అభిమానులు  షాక్ అయ్యారు. కాగా మొత్తానికి  ఇది ఫేక్ వీడియో అని  జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్  తేల్చేశారు. సదరు ఒరిజినల్ వీడియో ని కూడా షేర్ చేశారు

ఈక్రమంలోనే అమితాబ్ బచ్చన్, సాయి ధరమ్ తేజ్, నాగచైతన్య, చిన్మయి తదితరులు ఫిలిం స్టార్స్ రియాక్ట్ అవుతూ వస్తున్నారు. అలా చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక తాజాగా ఈ విషయం పై రష్మిక క్లోజ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ కూడా రియాక్ట్ అవుతూ పోస్టు వేసాడు. ఈ మేరకు తన ( Vijay Devarakonda ) ఇన్‌స్టా స్టోరీలో ఇలా రాసుకొచ్చాడు.. “ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే సైబర్ డిపార్ట్మెంట్ లో ఇలాంటివి త్వరగా అరికట్టేలా, వాటికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించేలా చట్టం తీసుకు రావాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ మార్ఫింగ్ వీడియో పై రాజకీయ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుండడంతో సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అయింది. సోషల్ మీడియా వేదికల్లో మార్ఫింగ్ వీడియోలు చేయడం, లేదా ఆ వీడియోలను సర్క్యులేట్ చేయడం వంటివి చేస్తే.. ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లోని సెక్షన్ 66D ని ఉదహరించి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధించబడుతుందని స్పష్టం చేసింది.

ఇక మరో వైపు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం “యానిమల్”. బాలీవుడ్​లో మోస్ట్ అవైటెడ్ ఫిలింగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోలు అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌ పతాకాలపై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్‌ కుమార్‌, ప్రణవ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ టీజర్, ట్రైలర్ చూస్తే.. సందీప్ చెప్పినట్టుగానే ఒక రేంజ్ వైలెన్స్ ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో.. డిసెంబర్ 1న సినిమా విడుదల కానుంది.