Last Updated:

Ashwini Vaishnaw: వందే భారత్ కు ధీటుగా వచ్చేస్తోంది ‘వందే మెట్రో’

లోకల్‌ రైళ్ల కంటే మెరుగైన రవాణా అందించే ఉద్దేశంతో వందే మెట్రో తీసుకువస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది.

Ashwini Vaishnaw: వందే భారత్ కు ధీటుగా వచ్చేస్తోంది ‘వందే మెట్రో’

Ashwini Vaishnaw: రైల్వే ప్రయాణికుల కోసం కేంద్ర రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. 100 కిలోమీటర్ల పరిధిలో ఉండే మెయిన్ సిటీలను కలిపేలా మెట్రో రైల్‌ వ్యవస్థ ‘వందే మెట్రో’ను తీసుకొస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఏడాది చివర్లోనే అవి పట్టాలు ఎక్కించనున్నట్టు ప్రకటించారు.

 

తక్కువ దూరాలను కనెక్ట్ చేసేలా(Ashwini Vaishnaw)

సూదూరంగా ఉండే ప్రధాన నగరాలను కనెక్ట్‌ చేస్తూ ప్రారంభించిన సెమీ హై స్పీడ్‌ రైళ్లు ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ విజయవంతం అయ్యాయి. ఈ ఉత్సాహంతోనే రైల్వే శాఖ ఇప్పుడు తక్కువ దూరంలోని ప్రధాన నగరాలను కనెక్ట్ చేసేలా వందే మెట్రో రైళ్లను తీసుకురాబోతున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లోనే వందే మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి.

వందే భారత్‌తో పోలిస్తే వందే మెట్రో డిఫరెంట్‌గా ఉంటుంది. డిసెంబర్‌ కల్లా ఈ రైళ్లు సిద్ధమవుతాయని తెలిపారు. అంతేకాకుండా వందే భారత్‌కు వస్తున్న రెస్పాన్స్ కు అనుగుణంగా వందే మెట్రోలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్‌-లక్నో మధ్య తొలి రైలు పట్టాలెక్కించాలని రైల్వే శాఖ అనుకున్నట్టు తెలుస్తోంది.

 

 

8 కోచ్‌లతో వందే మెట్రో

లోకల్‌ రైళ్ల కంటే మెరుగైన రవాణా అందించే ఉద్దేశంతో వందే మెట్రో తీసుకువస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. వేగంతో పాటు రూట్‌లో ఫ్రీక్వెంట్‌గా సర్వీసులను నడపాలని నిర్ణయించుకుంది. దాని వల్ల స్టూడెంట్స్ , ఉద్యోగుల ప్రయాణాలకు వందే మెట్రో బాగా ఉపయోగపడుతుందని రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ అభిప్రాయపడ్డారు. 8 కోచ్‌లతో వందే మెట్రో రైళ్లను నడపాలని అనుకుంటోంది. ఇప్పటికే చెన్నైలోని ఇంటీగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి, లక్నోలోని రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌కు ఆర్డర్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది.