Patiala Gurdwara: పంజాబ్‌లోని పాటియాలా గురుద్వారాలో మద్యం సేవిస్తున్న మహిళ కాల్చివేత
పంజాబ్‌లోని పాటియాలా దుఖ్నివారన్ సాహిబ్ గురుద్వారా కాంప్లెక్స్ ఆవరణలో మద్యం సేవించినందుకు ఓ మహిళపై కాల్పులు జరిగాయి. ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.

Patiala Gurdwara: పంజాబ్‌లోని పాటియాలా దుఖ్నివారన్ సాహిబ్ గురుద్వారా కాంప్లెక్స్ ఆవరణలో మద్యం సేవించినందుకు ఓ మహిళపై కాల్పులు జరిగాయి. ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.
మహిళపై అటెండర్ కాల్పులు..(Patiala Gurdwara)
ఆదివారం సాయంత్రం పర్మీందర్ కౌర్ అనే మహిళ సరోవర్ (పవిత్ర చెరువు) దగ్గర మద్యం సేవిస్తుండగా సాగర్ మల్హోత్రా అనే గురుద్వారా అటెండర్ ఆమెను గమనించాడు.ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు, అయితే ఇది ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది. అతను ఆమెను గురుద్వారా మేనేజర్ గదికి తీసుకెళ్లాడు, అక్కడ మరొక అటెండర్ ఆమెను కాల్చాడు. పర్మీందర్ కౌర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.
సాగర్ మల్హోత్రా కూడా కాల్పుల్లో గాయపడి పాటియాలాలోని రాజేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు పర్మిందర్ కౌర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రాజేంద్ర ఆసుపత్రికి తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుబక్ష్ కాలనీలో నివాసముంటున్న పర్మీందర్ కౌర్ అవివాహితురాలు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- Ragi java: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ
- Nepali Sherpa: 26 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన నేపాలీ షెర్పా గైడ్