Published On:

Madhya Pradesh : విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్.. వీడియో వైరల్.. సస్పెన్షన్ వేటు

Madhya Pradesh : విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్.. వీడియో వైరల్.. సస్పెన్షన్ వేటు

Madhya Pradesh : విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు తప్పుదొవ పట్టిస్తున్నారు. పిల్లలను చెడు అలవాట్లకు బానిసలుగా మార్చుతున్నారు. ఓ టీచర్ తన బాధ్యతను మరిచి విద్యార్థులకు మద్యం తాగించాడు. ఈ ఘటన సంచలనం రేపుతోంది. పాఠశాలలో విద్యార్థులకు దగ్గరుండి మద్యం పోసి వారు తాగేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

 

మధ్యప్రదేశ్‌లోని కఠ్‌నీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బార్వారా బ్లాక్‌లోని ఖిర్హానీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో లాల్ నవీన్ ప్రతాప్‌సింగ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం టీచర్ కొందరు విద్యార్థులకు మద్యం తాగించాడు. వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. వీడియో జిల్లా కలెక్టర్ దిలీప్‌కుమార్ యాదవ్ కంటపడింది. దీంతో ఆ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా విద్యాశాఖాధికారి ఓపీ సింగ్‌ను ఆదేశించారు. అనంతరం ప్రతాప్‌సింగ్ సస్పెండ్ చేశారు.

 

 

ఇవి కూడా చదవండి: