Last Updated:

GHMC: కల్తీ ఆహారానికి చెక్.. కాల్ 040- 2111 1111- జీహెచ్ఎంసీ

ఇటీవల కాలంలో ఫుడ్ బిజినెస్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదనుకోండి. దానిని ఆసరాగా చేసుకుని కొంత మంది వ్యాపారులు నాణ్యతప్రమాణాలు లేకుండా అడ్డగోలుగా అమ్మకాలు జరుపుతున్నారు. దీనిపై ఆహార పరిరక్షణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆహార నాణ్యత విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని జీహెచ్‌ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

GHMC: కల్తీ ఆహారానికి చెక్.. కాల్ 040- 2111 1111- జీహెచ్ఎంసీ

GHMC: ఇటీవల కాలంలో ఫుడ్ బిజినెస్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదనుకోండి. దానిని ఆసరాగా చేసుకుని కొంత మంది వ్యాపారులు అడ్డగోలుగా అమ్మకాలు జరుపుతున్నారు. నాణ్యతప్రమాణాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు నానారోగాల బారిన పడుతున్నారు. దీనిపై ఆహార పరిరక్షణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా చిన్న బండిపై అమ్మే బజ్జీలు, పునుగుల నుంచి ఫైవ్ స్టార్ హోటల్లో వండే రెసిపీల వరకు ప్రతీ దానిని పరీక్షింది. ఈ తనిఖీల ద్వారా ఆహార పదార్థాల్లో అక్కడక్కడా ఏదో ఒక రూపంలో కల్తీ జరుగుతుందని గుర్తించింది. ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు లోపించాయని తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల సగటు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆహార నాణ్యత విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని జీహెచ్‌ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆహార నాణ్యత విషయంలో అనుమానం ఉంటే అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి ఆ ఆహార పదార్థాల నాణ్యతను నిర్ధారించనున్నారు ఆహార నిపుణులు. దీనికి గానూ ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో తొలి మొబైల్‌ ల్యాబ్‌ను శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ప్రారంభించారు. హానికరం, నకిలీ (మిస్‌ బ్రాండెడ్‌), నాసిరకం ఇలా మూడు రకాల ప్రమాణాలపై మొబైల్ ల్యాబ్ లో పరీక్షలు జరుపుతారు. కల్తీ ఉన్నట్లు గుర్తిస్తేఅవగాహన, చైతన్యం కలిగించి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తారు. మరల ఇదే కంటిన్యూ అయితే జరిమానాలు, శిక్ష విధిస్తారు. ప్రతి రోజూ ఒక్కో సర్కిల్‌లో పర్యటించి ఆహార నాణ్యతల పరీక్షించే పనిలో జీహెచ్‌ఎంసీ నిమగ్నమైంది. ఆహార నాణ్యత ప్రమాణాల విషయంలో అనుమానాలుంటే లేదా కల్తీ ఆహారం ఉన్నట్టు గుర్తిస్తే జీహెచ్‌ఎంసీ టోల్‌ ఫ్రీ నంబరు 040- 2111 1111ను సంప్రదించాలని అధికారులు ప్రజలను కోరారు.

ఇదీ చదవండి: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. డిజిటల్ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్

 

 

ఇవి కూడా చదవండి: