Last Updated:

CM Jagan :సీనియర్ల ఎత్తులకు సీఎం జగన్ పై ఎత్తులు..

గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఇటీవల జరిగిన సమీక్షలో వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని చెప్పి సీఎం జగన్ సీనియర్లకు షాక్ తినిపించారు

CM Jagan :సీనియర్ల ఎత్తులకు సీఎం జగన్ పై ఎత్తులు..

CM Jagan  : గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఇటీవల జరిగిన సమీక్షలో వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని చెప్పి సీఎం జగన్ సీనియర్లకు షాక్ తినిపించారు. ఇప్పటికే తమ పుత్ర రత్నాలను రెడీ చేసుకుని తమ నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున తిప్పేస్తున్న సీనియర్లు జగన్ నిర్ణయంతో ఒక్కసారిగా డీలా పడ్డారు. బాలినేని శ్రీనివాసులురెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, పేర్ని నాని, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు, భూమన కరుణాకరరెడ్డి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వంటి సీనియర్‌ నేతలు ఉన్నారు. వీరంతా తమ వారసులను తీర్చి దిద్ది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నారు.

తాము కాకపోతే తమ వారు అంటూ కొందరు ఎమ్మెల్యేలు, కీలక నేతలు వైసీపీలో వారసులను ముందుకు తెస్తున్నారు. దాని కోసం వారు తమకు తాముగానే నిర్ణయం తీసుకుని తమ వారసులను ఇప్పటి నుంచే జనాల్లోకి పంపిస్తున్నారు. అలా తాము రెస్ట్ తీసుకుంటూ గడపగడపకు వారసులను పరిచయం చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల తండ్రులను పక్కన పెట్టి అతి ఉత్సాహంతో వారసులు రోడ్డున పడ్డారు. మరి వీరంతా జగన్ ఆలోచనలు తెలిసే ఇలా చేస్తున్నారా.. లేక తమ మాట అధినేత తప్పక విని తమ వారసులకు టికెట్లు ఇస్తారని అతి ధీమాకు పోతున్నారా అన్నది పార్టీ వారికే అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.అయితే ఇటీవల నిర్వహించిన పార్టీ వర్క్ షాప్ లో జగన్ వారసుల విషయంలో కుండబద్ధలు కొట్టారని తెలిసింది. తాను వారసులకు టికెట్ ఇచ్చేదే లేదని తేల్చేశారు. మీరు ఇంట్లో ఉండి మీ వారసులను బంధువులను గడప గడపకూ పంపిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఓట్లేసిన జనాల వద్దకు మీరే వెళ్ళాలి. మీరే వారితో మమైకం కావాలి. మీ పనితీరు మార్చుకుంటే టికెట్లు మీకే ఇస్తాను తప్ప మీ వారసులకు కానే కాదు అని కూడా పేర్కొన్నారని టాక్. వచ్చే ఎన్నికలు టఫ్ గా ఉంటాయి కాబట్టి మీరు పోటీ చేయండి వారసులు వద్దు అని చెప్పేశారని వైసీపీ వర్గాల కథనం. దీంతో సీనియర్లు షాక్ తినేశారట.

కొంతమంది తెలివైన నాయకులు తమకు వివిధ కారణాల వల్ల టికెట్ నిరాకరిస్తే, వారసులను ముందు పెట్టి టికెట్ సంపాదించాలని వేస్తున్న ఎత్తుగడలకు ఆదిలోనే జగన్ చెక్ చెప్పేశారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆ విధంగా ఉత్తరాంధ్రలో కొన్ని నియోజకవర్గాల్లో వారసులు జనంలో తిరుగుతున్నారు. కృష్ణా జిల్లాతో పాటు రాయలసీమలో కొన్ని చోట్ల వారసులు హల్ చల్ చేస్తున్నారు. అలాంటి వారి మనసులో తాము కాకపోతే ఈసారి తమ వారికే సీటుకు ఖాయం అన్న ఆలోచన ఉంది. కానీ అలాంటివి కుదరవు అని జగన్ పక్కాగా చెప్పేసి గట్టి షాక్ ఇచ్చారు. దీంతో ఇపుడు తామే జనంలోకి వెళ్లాలి. అప్పటికిఈ పనితీరు మారకపోతే కొత్త వారికే టికెట్లు ఇస్తారు అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎవరు ప్రజల్లో ఉంటున్నారు. ఎవరు ఉండడం లేదో అనే విషయాలపై జగన్‌ – వైసీపీ నేతలకు పూస గుచ్చినట్టు వివరించినట్లు సమాచారం. దీంతో కొందరు నేతలు అవాక్కయ్యారట. ఇదీ సంగతి.. దీనిని బట్టి .. జగన్ వారసులను పక్కన పెడుతున్నారనే సంకేతాలు ఇచ్చేసినట్టేనని అంటున్నారు సీనియర్లు. మొత్తంమీద వారసుల్ని ప్రోత్సహించేది లేదంటున్నారు వై.ఎస్. వారసుడు.

అంటే జగన్ ఒక విషయంపై పక్కాగా క్లారిటీ ఇచ్చేసారు. ఇపుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వారు తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్లాలి. ప్రభుత్వ పధకాలను ప్రచారం చేయాలి. లేకపోతే తన వద్ద ఉన్న సర్వేల ప్రకారం వారికి 2024 ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేదిలేదు. ఐదేళ్లు శుభ్రంగా పదవులు అనుభవించేసి 2024 లో వారసులను తెరపైకి తెద్దామనుకుంటే కుదరదు. తాము రిలాక్స్ అయిపోయి తమ ఇష్టానుసారం నియోజకవర్గం టిక్కెట్టు తమ ఇంట్లోనే ఉంచుకుంటామంటే కుదరదు. ఇది తమ ప్రైవేట్ వ్యవహారం కాదు. పార్టీకి, ఎన్నికల్లో విజయావకాశాలకు సంబంధించినది. దీనితో ఇపడు సీనియర్లంతా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. తాము ఒకలా భావిస్తే సీఎం జగన్ మరోలా తలిచారని మధనపడుతున్నారట.

ఇవి కూడా చదవండి: