Last Updated:

YS Sharmila: సోనియా గాంధీతో సమావేశమయిన వైఎస్ షర్మిల

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం అయ్యారు ఈ భేటీ కోసం నిన్ననే.. భర్త అనిల్ తో కలిసి.. షర్మిల హస్తిన బయలుదేరి వెళ్లారు. అయితే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా..? లేక పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.

YS Sharmila: సోనియా గాంధీతో సమావేశమయిన  వైఎస్ షర్మిల

YS Sharmila: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం అయ్యారు ఈ భేటీ కోసం నిన్ననే.. భర్త అనిల్ తో కలిసి.. షర్మిల హస్తిన బయలుదేరి వెళ్లారు. అయితే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా..? లేక పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. ఈ సమావేశంలో తాజా పరిస్థితులపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. సోనియా, రాహుల్ తో గంటన్నర పాటు జరిగిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో పలు విషయాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది.

షర్మిల తన పార్టీ వైఎస్సార్టీపీ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే తనకు వచ్చే ప్రయోజనాలు, తను పోషించబోయే పాత్ర చర్చించినట్లు సమాచారం. అయితే షర్మిల తెలంగాణలో రాజకీయం చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదటినుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆమె ఏపీలో తన రాజకీయం చేయాలని రేవంత్ చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్లు షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిల రాక తమకు ప్లస్ అవుతుందని వారు భావిస్తున్నారు. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి ఎన్నికల బరిలోకి దిగాలనేది షర్మిల ఆలోచనగా తెలుస్తోంది. మరి చివరకు షర్మిల అడుగులు తెలంగాణవైపా? ఏపీ వైపా అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కేసీఆర్ కౌంట్ డౌన్ ప్రారంభం..(YS Sharmila)

సమావేశం అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ అయితే ఈ సమావేశం ఫల వంతంగా జరిగిందని.. తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమయిందన్నారు. నేను ఈ రోజు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిశాను. చాలా నిర్మాణాత్మక చర్చ జరిగింది. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాను. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, తెలంగాణ సీఎం కేసీఆర్ కౌంట్ డౌన్ ప్రారంభమయిందన్నారు.