Red Book Flexies: ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న రెడ్ బుక్ ..
రెడ్ బుక్..ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెడ్ బుక్...ఈ పేరు వింటేనే ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రెడ్ బుక్ పేరు వినగానే వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు. రెడ్ బుక్ సిద్ధమైందంటూ ఏపీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Red Book Flexies: రెడ్ బుక్..ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెడ్ బుక్…ఈ పేరు వింటేనే ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రెడ్ బుక్ పేరు వినగానే వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు. రెడ్ బుక్ సిద్ధమైందంటూ ఏపీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నారా లోకేష్ రెడ్ రెడీ అయిందన్న ప్రచారం జరగడంతో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోవైసీపీని పాతరేసి కూటమికి జనం జైకొట్టడంతో..వైసీపీలో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి…భారీ మెజార్టీతో ఘన విజయం సాధించింది. అటు వైనాట్ 175 అనే నినాదంతో ఓట్లకు వెళ్లిన వైసీపీ…ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా చిత్తు చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ ప్రస్తవన హాట్ టాపిక్గా మారింది.
టీడీపీ కార్యకర్తలను వేధించిన వారి పేర్లు..(Red Book Flexies)
రెడ్ బుక్లో మెయిన్ టార్గెట్గా…సిట్ అధిపతి కొల్లి రఘురాంరెడ్డి, సిఐడి చీఫ్ సంజయ్, ఎఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, టిటిడి ఇవో ధర్మారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొంత మంది ఐపిఎస్ లు, ఐఎఎస్ లు, పోలీసు అధికారుల పేర్లున్నాయని సమాచారం. రెడ్ బుక్ లో పేర్లున్న వారిపై విచారణ కోసం స్పెషల్ టీం వేసే దిశగా నూతన ప్రభుత్వం అడుగులు వేయబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెడ్ బుక్ అంటే టీడీపీ నేతలను, కార్యకర్తలను వేధించిన వైసీపీ నేతల పేర్లు, అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లను తన రెడ్ బుక్ లో నమోదు చేసుకుంటున్నానని ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు ప్రస్తావించారు నారా లోకేష్. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రానుండడంతో..రెడ్ బుక్లో అసలేం రాశారు.? అందులో ఎవరి పేర్లు ఉన్నాయి? ఏం చేస్తారు? రెడ్ బుక్లో ప్రస్తావించిన వారి పేర్లుపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అన్న చర్చ హాట్ హాట్ గా సాగుతోంది.
రెండు రోజుల క్రితం మంగళగిరిలోని పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ఆసక్తిని రేపుతున్నాయి. సిద్ధం ఫర్ రెసిలియన్స్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ అంటూ ప్లెక్సీలో పొందు పరిచారు. అడుసుమిళ్లి సురేంద్ర పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ చూపరులను ఆకట్టుకుంటోంది.