Last Updated:

CM KCR: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి తిడతారు.. ఢిల్లీకి వెళ్లి అవార్డులిస్తారు.. సీఎంకేసీఆర్

కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ను తిడతారు. మరలా ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పధకాలు బాగున్నాయిని అవార్డులు ఇస్తారని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు.

CM KCR: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి తిడతారు.. ఢిల్లీకి వెళ్లి అవార్డులిస్తారు.. సీఎంకేసీఆర్

Warangal: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ను తిడతారు. మరలా ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పధకాలు బాగున్నాయిని అవార్డులు ఇస్తారని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. శనివారం వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిమ మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్దానంలో ఉందని ప్రపంచానికి అన్నం పెట్టే స్తోమత ఉందన్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో చెప్పిన‌వ‌న్నీ ఇవాళ సాకారం అయ్యాయి. తెలంగాణ జీఎస్‌డీపీ ఎక్కువ‌గా ఉంది. ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నంతో పాటు అనేక రంగాల్లో ముందంజ‌లో ఉన్నాము. తెలంగాణ ప్ర‌జ‌ల్లో అద్భుత‌మైన చైత‌న్యం ఉంది. అన్ని వ‌ర్గాల‌ ఆకాంక్ష‌ల మేర‌కు ప‌ని చేస్తున్నామ‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

2014 కంటే ముందు ఐదు కాలేజీలు మాత్ర‌మే ఉండే, కొత్త‌గా 12 కాలేజీలు మంజూరు చేశాం. 33 జిల్లాల్లో మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేశాం. త్వ‌ర‌లోనే అన్ని కాలేజీలు ప్రారంభ‌మ‌వుతాయి. హ‌రీశ్‌రావు సార‌థ్యంలో ఇది సాధ్య‌మైంది. 2014కు ముందు 2800 మెడిక‌ల్ సీట్లు ఉండేవి. ఇప్పుడు 6500 మెడిక‌ల్ సీట్లు ఉన్నాయి. అన్ని మెడిక‌ల్ కాలేజీలు అందుబాటులోకి వ‌స్తే దాదాపు 10 వేలు కూడా దాటే అవ‌కాశం ఉంది. మ‌న విద్యార్థులు ర‌ష్యా, ఉక్రెయిన్‌కు వెళ్లే అవ‌కాశం కూడా రాదు. పీజీ సీట్లు 1150 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య‌ 2500కు చేరింది. ఆరోగ్య రంగంలో చాలా బాగా పురోగ‌మిస్తున్నామని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నాం. సిరిసిల్ల, ములుగు జిల్లాల హెల్త్ ప్రొఫైల్ పూర్తిఅయింది. ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఒక్క నిమిషంలో హెల్త్ ప్రొఫైల్ తెలుసుకొని చికిత్స చేయొచ్చని కేసీఆర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి: