Telangana Congress : ఎప్పుడు అన్యాయం వైపు నిలబడుతారా? కంచ గచ్చిబౌలి భూములపై సెలబ్రెటీలకు కాంగ్రెస్ కౌంటర్

Telangana Congress : గతేడాది డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. పుష్ప-2 మూవీ చూసేందుకు థియేటర్‌కు అల్లు అర్జున్ రావడంతో అతడిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి తరలించి వైద్యం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన సంగతి తెలిసిందే. విచారణ చేపట్టిన కోర్టు అల్లుకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చర్లపల్లికి జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే హైకోర్టును హీరో అల్లు ఆశ్రయించగా, ముందు నాలుగు వారాల మధ్యంతర బెయిల్, తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిలో ఐటీ పార్కుల అభివృద్ధిని నటి, పర్యావరణవేత్త దియా మీర్జా వ్యతిరేకించారు. జీవవైవిధ్యాన్ని ఫణంగా పెట్టి అభివృద్ధి చేడటం విధ్వంసమేనని అన్నారు. జీవవైవిధ్యాన్ని పెట్టి ‘అభివృద్ధి’ అంటే వినాశనం. కంచ గచ్చిబౌలి అటవీని కాపాడాలని ఆమె పోస్ట్ చేశారు. భవిష్యత్ తరాల కోసం అటవీని కాపాడాలని నటి రేణు దేశాయ్ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఐటీ పార్కుల ప్రణాళికలను విరమించుకోవాలని సీఎంను కోరుతూ ఒక వీడియోను ఆమె విడుదల చేశారు. యాకంర్ రష అటవీని రక్షించడానికి జరుగుతున్న ఉద్యమానికి యూట్యూబర్ ధ్రువ్ రథీ కూడా మద్దతుగా నిలిచారు. ఇది ఆమోదయోగ్యం కాదని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తెలంగాణలో విధ్వంసాన్ని ఆపాలని రాహుల్ గాంధీని కోరారు. తాజాగా సెలబ్రెటీలు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ కౌంటర్ ఇచ్చింది.
అన్యాయం వైపు నిలబడుతారా?..
మిడిమిడి జ్ఞానంతో అన్యాయం వైపు నిలబడుతారా? అని సెలబ్రెటీలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. నాడు సంధ్య థియేటర్ ఘటన బాధితుడి వైపు కాకుండా హీరో అల్లు అర్జున్‌కు మద్దతు ఇస్తారా? అని ఫైర్ అయ్యింది. తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణం మీకు కనిపించలేదా అని మండిపడ్డింది. ఎప్పుడూ సెలబ్రెటీలు అన్యాయం వైపు నిలబడుతున్నారని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎప్పుడైనా ప్రచారం చేశారా అని నిలదీసింది.
నాడు సంధ్య థియేటర్.. నేడు హెచ్‌సీయూకు మద్దతా?
నాడు సంధ్య థియేటర్ ఘటన బాధితుడికి.. నేడు కంచ గచ్చిబౌలి భూములకు సెలబ్రెటీలు మద్దతు ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ మండిపడ్డింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి చర్చించకుండా అన్యాయం వైపు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించింది. ప్రభుత్వం మంచి పనులకు సహకరించకుండా ప్రభుత్వంపై విమర్శలా అని ఫైర్ అయ్యింది. సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలబడకుండా హీరోకు అండగా ఉంటారా అని ప్రశ్నించింది. ఘటన జరిగినా 20 రోజులకు స్పందించి బాలుడికి పరామర్శించి ఆర్థిక సాయం చేస్తారా అని మండిపడ్డింది. ఇప్పటికైనా సెలబ్రెటీలు మిడిమిడి జ్ఞానంతో కాకుండా మంచి పనులకు సహకరించాలని కోరింది.