Last Updated:

Swachh Bharat Mission: తెలంగాణాకు అవార్డులు పంట

స్వచ్ఛ భారత్ మిషన్ లో దేశ వ్యాప్తంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. వివిధ విభాగాల్లో 13 అవార్డులు రాష్ట్రానికి దక్కాయి.

Swachh Bharat Mission: తెలంగాణాకు అవార్డులు పంట

Hyderabad: స్వచ్ఛ భారత్ మిషన్ లో దేశ వ్యాప్తంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. వివిధ విభాగాల్లో 13 అవార్డులు రాష్ట్రానికి దక్కాయి. అవార్డులను అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివాస్ లో అందుకోనున్నట్లు తెలంగాణ మంత్రి ఎర్రబల్లి దయాకర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి అవార్డులు రావడం పై ఆయన హర్షం వ్యక్తం చేసారు. అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, ఆ దిశగా అడుగులు వేయించిన సీఎం కేసిఆర్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

జిల్లాల క్యాటగిరీలో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలు రెండు మూడు స్థానాల్లో నిలిచాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విభాగంలో నిజామాబాద్, భద్రాధ్రి కొత్త గూడెం జిల్లాలు రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. అవార్డులు సాధించినందుకు తగిన నిధులు కూడా కేంద్రం మంజూరు చేయాలని ఈ సందర్భంగా కేంద్రానికి ఎర్రబల్లి విజ్ఞప్తి చేశారు.

follow us

సంబంధిత వార్తలు