Last Updated:

Thandel First Review: నాగ చైతన్య ‘తండేల్‌’పై సెన్సార్‌ రివ్యూ – బోర్డు సభ్యులు ఏమన్నారంటే..!

Thandel First Review: నాగ చైతన్య ‘తండేల్‌’పై సెన్సార్‌ రివ్యూ – బోర్డు సభ్యులు ఏమన్నారంటే..!

Naga Chaitanya Thandel Censor Talk: అక్కినేని హీరో నాగ చైతన్య మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘తండేల్’. కార్తికేయ 2 ఫేం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇందులో నాగ చైతన్య సరసన ఈ సినిమాలో నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. లవ్‌స్టోరీ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత వీరిద్దరు తండేల్‌ కోసం మరోసారి జతకట్టారు. వెండితెరపై వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో మొదటి నుంచి మూవీపై మంచి బజ్‌ నెలకొంది. ఈ క్రమంలో మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్స్‌ కూడా మంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి.

ముఖ్యంగా పాటలకు విశేష స్పందన వస్తోంది. బుజ్జితల్లి పాటలకు యూట్యూబ్‌ని షేక్‌ చేసింది. ఆ తర్వాత విడుదలైన మహా శివరాత్రి, హైలెస్సో పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. లవ్‌ ఎమోషన్‌తో సాగిన ట్రైలర్‌ ఆద్యాంతం ఆకట్టుకుంది. ఇక సినిమా ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధం అవుతుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌ కార్యక్రమాలను వేగవంత చేసింది మూవీ టీం. ఈ నేపథ్యంలో తాజాగా తండేల్‌ మూవీ సెన్సార్‌ బోర్డుకు వెళ్లింది. ఈ సినిమా చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు ఎలాంటి కట్స్‌ లేకుండ యూ/ఎ సర్టిఫికేట్‌ జారీ ఇచ్చారు.

బ్లాక్‌బస్టర్‌ ఖాయం

అంతేకాదు ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ పక్కా అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా చూడలేదని, మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడుతుందనడంలో సందేహం లేదంటూ ఒక్క మాటలో మూవీపై తమ రివ్యూ ఇచ్చారట. సెన్సార్‌ కామెంట్స్‌తో మూవీ టీం ఫుల్‌ ఖుష్‌ అవుతుంది. కాగా ఈ సినిమా అవుట్‌పుట్‌ చూసిన నిర్మాత అల్లు అరవింద్‌ 100కు వంద మార్కులు వేశారని నిర్మాత బన్నీ వాసు ట్వీట్‌ చేశారు. అలాగే తండేల్‌ మూవీ మంచి విజయం సాధిస్తుందని, నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా తండేల్‌ మూవీ నిలుస్తుందని బన్నీ వాసు ముందు నుంచి చెప్పుకొస్తున్నారు.

‘తండేల్‌’ నిడివి విషయానికి వస్తే

తండేల్‌ మూవీని క్రిస్పీగా తీశారని సెన్సార్‌ టీం చెబుతోంది. సినిమా నిడివి ఎక్కువ తక్కువ కాకుండ కరెక్ట్‌గా కట్‌ చేశారని. యాడ్స్‌తో కలిపి ఈ సినిమాను 2:32 గంటల నిడివి ఉందని తెలుస్తోంది. దేశభక్తి కథకు యాక్షన్‌, ఎమోషన్స్‌ జోడించి మంచి కథగా మలిచాడట చందు మొండేటి. అనసర సీన్స్‌ ఏం లేకుండ తక్కువ టైంలో కథని మాత్రమే ఎలివేట్‌ చేసేలా సీన్స్‌ ఉన్నాయని సెన్సార్‌ సభ్యులు పేర్కొన్నట్టు టాక్‌. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే… శ్రీకాకుళంకు చెందిన రాజు అనే జాలరి చేపల వేటకు వెళ్లి పొరపాటున పాకిస్తాన్‌ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్‌ నేవి అధికారులు అతడిని అరెస్ట్‌ చేసి బంధిస్తారు. అతడిని ఇండియాకు రప్పించేందుకు ఆయన ప్రియురాలు చేసిన పోరాటమే ఈ తండేల్‌ కథ. ఇంటెన్స్‌ లవ్‌స్టోరీకి చందు మొండేటి దేశభక్తిని కూడా జోడించి తండేల్‌ అద్భుతంగా రూపొందించాడు.