Dasoju Shravan : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్.. ఖారారు చేసిన కేసీఆర్

Dasoju Shravan : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. దీంతో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కనున్నది. ఒక్క స్థానానికి అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గులాబీ పార్టీ నుంచి సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్ పేర్లు ముందు నుంచీ వినిపించాయి. అంచనాల ప్రకారమే శ్రవణ్ పేరును కేసీఆర్ ఖారారు చేసి ప్రకటించారు. రేపు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ పార్టీకి నాలుగు స్థానాలు దక్కగా, ఒక స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐ పార్టీకి కాంగ్రెస్ కేటాయించింది. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది.