Published On:

Congress Leader: కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే

Congress Leader: కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే

MLA Tellam Venkatarao Saved Congress leader’s heart attack by doing CPR: తెలంగాణలోని భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ సమయంలో ఓ కాంగ్రెస్ నేతకు గుండెపోటు వచ్చింది. అయితే వెంటనే అక్కడ ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆయనకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.

 

వివరాల ప్రకారం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యే వెంకట్రావు భద్రాచలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ నేత అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన గుండెపోటుతో కిందపడ్డాడు.

 

కాగా, దుమ్ముగూడెం మండల కేంద్రానికి చెందిన మోత్కూరు సుధాకార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఆయన పర్యటనకు రాగ.. ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే వెంకట్రావు ఆయనకు సీపీఆర్ చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే అక్కడ ఉన్న అందరూ ఎమ్మెల్యేను అభినందించారు.

ఇవి కూడా చదవండి: