Last Updated:

Miss World Compitition : భారత్ గొప్ప ప్రదేశం.. విశ్వ సుందరి క్రిస్టినా ఆసక్తికర వ్యాఖ్యలు

Miss World Compitition : భారత్ గొప్ప ప్రదేశం.. విశ్వ సుందరి క్రిస్టినా ఆసక్తికర వ్యాఖ్యలు

Miss World Compitition : హైదరాబాద్ నగరం వేదికగా 72వ ప్రపంచ సుందరి పోటీలు జరుగనున్నాయి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసింది. ప్రపంచ సుందరి పోటీలకు ముందు అధికారులు బేగంపేట టూరిజం ప్లాజాలో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమానికి 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా హాజరయ్యారు. టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జూలియా మోర్లీ పాల్గొన్నారు.

 

 

సందర్భంగా విశ్వ సుందరి క్రిస్టినా మాట్లాడారు. భారత్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమస్తే ఇండియాతో ప్రసంగం మొదలుపెట్టారు. తెలంగాణలోని దేవాలయాల గురించి మాట్లాడారు. తమ కోసం ఇన్ని ఏర్పాట్లు చేసినందకు ధన్యవాదాలు తెలిపారు. భారత్ గొప్ప ప్రదేశం అని, 2024 ప్రపంచ సందరిగా తన ప్రస్థానం భారత్‌తో ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. భారత్ మనకు చాలా నేర్పుతుందని, ప్రతీ విషయంలో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో చాలా దేవాలయాలను సందర్శించానని చెప్పారు. ఇక్కడి ఆలయాలు గొప్ప విలువలను నేర్పుతాయన్నారు. ఇక భారత్‌లో ఒక స్పిరిట్ ఉందని, వివిధ మతాల వారు, వివిధ భాషల వారు కలిసి జీవిస్తున్నారని కొనియాడారు. ఇక్కడ ట్రెడిషన్ కూడా చాలా బాగా నచ్చిందని, ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

 

 

తెలంగాణ త్రిలింగ దేశంగా ప్రాముఖ్యత కలిగిందని, ఈ ప్రాంతానికి 2,500 ఏళ్ల చరిత్ర ఉందని టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన 11 ఏళ్లలో ఎంతో వృద్ధి సాధించామన్నారు. రామప్ప, వేయి స్తంభాల గుడి, చార్మినార్, గోల్కొండ కోట లాంటి ఎన్నో గొప్ప కట్టడాలు ఉన్నాయని తెలిపారు. మేలో ప్రపంచ సుందరి పోటీలను రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ టూరిజంలో తెలంగాణకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, సినిమా, ఆహార రంగాల్లో పెట్టింది పేరన్నారు.

ఇవి కూడా చదవండి: