Last Updated:

KTR: బీసీల ఓట్ల కోసమే కొత్తనాటకం.. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన సర్వే

KTR: బీసీల ఓట్ల కోసమే కొత్తనాటకం.. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన సర్వే

KTR Comments On Congress Government: బీసీల ఓట్ల కోసం కులగణన అనే కొత్త నాటకం మొదలుపెట్టారని ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. హనుమకొండలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో కేటీఆర్‌ మాట్లాడారు. బీసీ డిక్లరేషన్‌ పేరిట ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఏడాది కిందట బీసీ డిక్లరేషన్‌ పేరుతో అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. హామీలు కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసిందా అని ప్రశ్నించారు. చేతిగుర్తుకు ఓటేసిన పాపానికి చేతివృత్తిదారుల గొంతు కోశారన్నారు. కొత్త పథకాల మాట దేవుడెరుగు. ఉన్న పథకాలే ఆగిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆగిపోయిన రైతుబంధు, దళితబంధు..
రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రాగానే రైతుబంధు, దళితబంధు పథకాలు ఆగిపోయాయన్నారు. కులగణనలో 175 ప్రశ్నలు అడుగుతున్నారని తెలిపారు. బ్యాంకుల్లో డబ్బు ఎంత ఉంది? ఇంట్లో ఏసీ ఉందా? ఫ్రిజ్‌ ఉందా? అని అడుగుతున్నారని పేర్కొన్నారు. దీనిపై కులగణన కోసం వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. బీసీల ఓట్ల కోసం అధికారులను బలిపశువులను చేస్తున్నారన్నారు.

42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. బీసీలకు 42 శాతం హామీలు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని తెలిపారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన..
మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే తెలంగాణలో కులగణన సర్వే చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. కులగణన అంటున్నారు కానీ.. బీసీల రిజర్వేషన్‌ గురించి మాట్లాడటం లేదన్నారు. బీసీ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నేతలు చెప్పారని తెలిపారు. ఒక్క బీసీ బిడ్డకు అయినా రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చారా అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి: