Published On:

TG ICET 2025: రేపు, ఎల్లుండి టీజీ ఐసెట్.. అన్ని ఏర్పాట్లు పూర్తి

TG ICET 2025: రేపు, ఎల్లుండి టీజీ ఐసెట్.. అన్ని ఏర్పాట్లు పూర్తి

Telangana: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం రేపు, ఎల్లుండి టీజీ ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. జూన్ 8న రెండు సెషన్లలో, జూన్ 9న ఒక సెషన్ లో పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో సెషన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 71,757 మంది హాజరుకానున్నారు. వీరి కోసం అధికారులు 96 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లను http://icet.tgche.ac.in వైబ్ సైట్ లో పెట్టామని, అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఇక పరీక్షకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆన్ లైన్ లో నిర్వహించే పరీక్షకు అభ్యర్థులు హాల్ టికెట్, ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకుని రావాలని సూచించారు.